ఏపి లో అభ్యర్థులు మృతి.. 81 చోట్ల వాయిదా..!

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ మొత్తం ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే పలువురు ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. 8 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోగా.. పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించిన 11 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2 వేల 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలుండగా.. 2వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.

అభ్యర్థులు మరణించిన 81 చోట్ల ఎన్నికలను వాయిదా వేశారు. మిగిలిన 7వేల 220 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 18 వేల 782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 7 వేల 735 పరిషత్ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే ఎన్నిక ముగియనుంది. 2 కోట్ల 46 లక్షల 71 వేల 2 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -

కిడ్నాప్ అనుకున్నారు.. కానీ జరిగింది వేరే..!

దుమ్మురేపుతున్న ‘పుష్ప’ టీజర్!

మరోసారి నర్సు.. మోదీ గురుంచి చెప్పిన మాటలు..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -