Monday, May 6, 2024
- Advertisement -

కామ‌న్వెల్త్ క్రీడల వేదిక మార్పు… బ‌ర్మింగ్‌హ‌మ్‌లో 2022లో నిర్వ‌హ‌ణ‌

- Advertisement -

కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ)కు 2022 ఆతిథ్యమిచ్చే ప‌ట్ట‌ణం మారిపోయింది. తొలుత దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ ఆర్థిక కార‌ణాల‌తో తాము నిర్వ‌హించ‌లేమ‌ని చెబుతూ ఈ అవ‌కాశాన్ని వ‌దిలేసింది. దీంతో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ 2022 కామ‌న్ వెల్త్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూజీ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్‌ మార్టిన్‌ గురువారం ప్ర‌క‌టించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా డర్బన్‌లో నిర్వ‌హించ‌డం తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో మరో వేదికను ఎంపిక చేశారు. భార‌త‌దేశంలోని ఢిల్లీలో 2010లో నిర్వ‌హించ‌గా అప్ర‌తిష్ట‌పాలు తీసుకువ‌చ్చింది.

2022 సంవత్సరం జూలై 27 నుంచి 7వ తేదీ వరకు కామ‌న్‌వెల్త్ క్రీడ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ బడ్జెట్ రూ.14 వేల కోట్లు (1.845 బిలియన్‌ యూరోలు)గా నిర్వాహకులు అంచనా వేశారు. దీంతో గ్రేట్‌ బ్రిటన్‌లో మరో నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా మారనుంది. మాంచెస్టర్‌ (2002 కామన్వెల్త్‌), లండన్‌ (2012 ఒలింపిక్స్‌), గ్లాస్గో (2014 కామన్వెల్త్‌) ఇప్పటికే మెగా ఈవెంట్స్‌కు వేదికలుగా నిలిచాయి. 2022 కామన్వెల్త్‌ క్రీడల వేదిక మారింది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఈ మెగా టోర్నీ జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -