Monday, April 29, 2024
- Advertisement -

న‌టిని ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న విలన్‌

- Advertisement -

తెలుగు త‌మిళ భాష‌ల‌లో విల‌న్‌గా న‌టిస్తు మంచి పేరు సంపాదించాడు హరీష్ ఉత్తమన్.తెలుగులో గౌరవం, పవర్, జిల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణ గాడి వీర ప్రేమగాధ, మిస్టర్, దువ్వాడ జగన్నాధమ్, జై లవ కుశ, నా పేరు సూర్య సినిమాల‌లో విల‌న్‌గా న‌టించిన హరీష్ ఉత్తమన్ ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.హరీష్ ఉత్తమన్ తన ప్రియురాలు అమృత కళ్యాణ్‌పూర్‌‌ను పెళ్లాడారు. నవంబర్ మొదటి వారంలోనే వీరి వివాహం రహస్యంగా కేవలం కొంత మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో పాటు సోషల్ మీడియాలో ఫోటోస్ లీక్ అయ్యాయి.

కేరళలోని గురువాయూర్ టెంపుల్‌లో నవంబర్ 6న వీరి వివాహం సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది. అమృత కళ్యాణ్‌పూర్‌, హరీష్ మధ్య కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోంది.పెద్దల అంగీకారంతో వివాహం ఇరుకుంటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం మీడియాకు తెలియకుండా రహస్యంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.పెళ్లి గురించి త్వరలోనే ప్రకటన అయితే తన పెళ్లి విషయాన్ని హరీష్ ఇప్పటి వరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారని సన్నిహితులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -