Thursday, May 2, 2024
- Advertisement -

శ‌బ‌రిమ‌ళ ఆల‌య వివాదంకు సంబంధించిన నిజాలు వెలుగులోకి..

- Advertisement -

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా అయ్య‌ప్ప భ‌క్తులు భ‌గ్గుమంటున్నారు. సుప్రీం తీర్పును సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తూ.. మహిళలు శబరిమలలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. గ‌త కొన్ని రోజులుగా శ‌బ‌రిమ‌ళ‌లో యుద్ధ వాతార‌ణం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఆల‌యంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు మహిళల ప్రవేశానికి సంబందంచి సంచ‌ల‌న ఆధారాలు వెలుగులోకి వ‌చ్చాయి.

తరతరాలుగా అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమం వయసులో ఉన్న మహిళల ప్రవేశంపై నిషేధం ఉందని వారు వాదిస్తున్నారు. దీనికిక సంబంధించిన ఆధారాలు ఇప్పుడ బ‌య‌ట ప‌డ్డాయి. సుమారు 200 ఏళ్ల కిందట మనదేశాన్ని పరిపాలించిన బ్రిటీష్ వారు శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించినట్లు బ్రిటిష్ పత్రాల ద్వారా స్పష్టమైంది.

బెంజమిన్‌ స్వైన్‌, పీటర్‌ ఇరే కానర్‌ అనే ఇద్దరు బ్రిటిష్‌ సైనికాధికారులు దీనిపై దాదాపు ఐదేళ్ల పాటు అధ్యయనం నిర్వహించి, 1820లో ఆ వివరాలను నివేదిక రూపంలో పొందుపరిచారు. 50 ఏళ్లు దాటిన మహిళలు, 10 ఏళ్ల వయసులోపు బాలికలు ఆలయానికి వెళ్లొచ్చని, రుతుక్రమం కొనసాగుతున్న వయసు మహిళలకు ప్రవేశం నిషిద్ధమని ఆ సైనికాధికారులు తమన నివేదికలో పేర్కొన్నారు

1820లో పూర్తయిన ఈ సర్వే వివరాలతో 1893లో ఒక సంపుటి, 1901లో మరో సంపుటిని ప్రచురించారు. పర్వతం వెలిసిన ఈ ఆలయాన్ని ‘‘చౌరిముల్ల’’కు అంకితం చేసినట్లుగా తెలిపారు. దీనిని ‘‘ పర్వత దేవత’’ల ఆలయంగా వివరించారు. ఆ రోజుల్లోనే ప్రతి ఏడాది జనవరి నెలలో ఐదు రోజుల పాటు 10 నుంచి 15 వేల మంది భక్తులు వచ్చేవారని వివరించారు.

ఈ పత్రాలపై చరిత్రకారుడు శశిభూషణ్ స్పందించారు. రుతుక్రమంలో ఉన్న మహిళలకు శబరిమలలోకి ప్రవేశంపై బ్రిటిష్ ప్రభుత్వ నివేదికే తిరుగులేని ఆధారమని తేల్చి చెప్పారు. ట్రావెన్ కోర్ సంస్థానంలో ఇది అలిఖిత చట్టంగా అమలైందని, 1991లో కేరళ హైకోర్టు ఈ నిషేధానికి చట్టబద్ధత కల్పించిందన్నారు.

అయితే, పందళం రాజవంశానికి చెందిన రాజమాత అయ్యప్ప అలయాన్ని దర్శించారని, అప్పటికి ఆమె వయసు 42 ఏళ్లే అయినా, ఆమె గర్భసంచిని అప్పటికే తొలగించడంతో శబరిమల వెళ్లేందుకు అర్హత సాధించారని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -