Sunday, May 19, 2024
- Advertisement -

దేవుడిపై భారం వేయకు..పవన్‌ ఫ్యాన్‌కు షాక్‌!

- Advertisement -

పవన్‌తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తెరకెక్కించారు దర్శకుడు హరీష్‌ శంకర్. పవన్ కెరీర్‌లోనే ఇది బ్లాక్ బాస్టర్ హిట్ మూవీగా నిలిచింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ని తెరకెక్కిస్తుండగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయిందని తెలుస్తోండగా దీనిపై ఫ్యాన్స్‌ తమదైన శైలీలో స్పందించారు. హరీష్ సినిమాని తన మార్క్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తుండగా దీనిపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. క్వాలిటీ లేకుండా సినిమా చేస్తున్నారు దేవునిపైనే భారం వేస్తున్నామని ఓ పవన్ ఫ్యాన్ ట్వీట్ చేయగా దీనికి సాలిడ్ రిప్లై ఇచ్చారు హరీష్ శంకర్.

అంతే కదా తమ్ముడు అంతకు మించి ఏం చేయగలవ్ చెప్పు? ఈలోగా కాస్త కెరీర్, ఉద్యోగం, చదువుపై దృష్టి పెట్టు వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు అంటూ చురకలు అంటించారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్ – హరీష్‌ శంకర్ మధ్య జరిగిన ఈ ట్వీట్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చాలామంది హరీష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -