Monday, May 13, 2024
- Advertisement -

తెలంగాణ బీజేపీలో చీలిక!

- Advertisement -

తెలంగాణ బీజేపీలో చీలికరానుందా..?కొత్తగా పార్టీలో చేరిన వారికి..పాత వారికి పొసగడం లేదా..?బండిని అధ్యక్ష పదవి నుండి దించినా అసమ్మతి చల్లారలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనుండగా రేసులో వెనుకబడిపోయింది బీజేపీ పార్టీ.

క్షేత్రస్ధాయిలో కార్యక్రమాలు చేస్తున్న ఆ పార్టీకి వస్తున్న ఆదరణ అంతంతమాత్రమే. మీడియాలోనూ బీజేపీ ప్రస్తావనే రావడం లేదు. దీనికి తోడు పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు గమనిస్తుంటే పార్టీలో చీలికరావడం ఖాయంగా కనిపిస్తోంది. వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరిన నేతలు ఓ నాయకుడి ఇంట్లో కీలకభేటీ జరిపారు. బీజేపీని వీడేందుకే ఈ భేటీ జరిగిందని ప్రచారం జరుగుతోంది.

మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయ శాంతి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, సీనియర్ నేతలు గరికపాటి రామ్మోహన రావు భేటీ అయ్యారు. బీజేపీ అధిష్ఠానం తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఉన్న పలువురు నేతలు ఇప్పటికే బీజేపీకి దూరంగా ఉంటున్నారు.వచ్చే ఎన్నికల్లో వీళ్లకు టికెట్లు కన్ఫామ్ కానీ గెలిచేది మాత్రం నమ్మకం తక్కువే. అందుకే ఈ నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.వీరందరి తరపున వివేక్ కాంగ్రెస్ అగ్రనేతలతో ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపారట. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వీరు బీజేపీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరనున్నారట. ఇదే గనుక జరిగితే బీజేపీకి కోలుకోలేని దెబ్బే. వీరిబాటలోనే మరికొంతమంది నేతలు పయనించే అవకాశం ఉండటంతో ఒకప్పుడు చేరికలతో బీజేపీలో జోష్ నిండగా ఇప్పుడు అదే నేతలు పార్టీని వీడుతుండటం భారీ షాకే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -