పద్మావత్ చిత్రానికి ఇంకా అడ్డంకులు తొలగిపోలేదు. ఈ సినిమా విడుదలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరిగిన రచ్చ తెలిసిందే. అనేక వివాదాస్పాదాలు మార్పులు చేర్పులు పూర్తయి విడుదలకు సిద్దంగా ఉంది. చిత్రం విడుదలకు సీబీఎఫ్‌సీ మార్గం సుగమం చేసినప్పటికీ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఆ చిత్రాన్ని విడుదల చేసేందుకు సుముఖంగా లేవు.
ఈ సినిమా విడుదలపై రాజ్‌పుత్ వర్గాల నుంచి వ్యతిరేకత దృష్ట్యా ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ‘పద్మావత్’ చిత్రం విడుదలను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో హర్యానా రాష్ట్రం కూడా పద్మావత్ విడుదలను నిషేధించింది
ఈ మేరకు హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసన కారణంగా మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 25న ఈ చిత్రం విడుదలకానుంది.