Sunday, April 28, 2024
- Advertisement -

గుజరాత్ ట్రైయాంగిల్ ఫైట్.. గెలుపేవరిది?

- Advertisement -

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ ఎన్నికల మొదటి విడత పోలింగ్ నేడు జరుగుతోంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో 18 జిల్లాలలోని 89 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన 93 స్థానాలకు ఈ నెల 5వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈనెల 8న తెలనున్నాయి. అయితే గతంలో కంటే ఈసారి గుజరాత్ ఎన్నికలపై ఈసారి దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గత 27 ఏళ్లుగా గుజరాత్ లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది బీజేపీ. దాంతో ఈసారి బీజేపీ అధికారానికి కళ్ళెం వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఇదే టైంలో ప్రస్తుతం దేశంలో రైజింగ్ పార్టీ గా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి గుజరాత్ ఎన్నికల బరిలో దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది. పంజాబ్ లో బీజేపీ కి షాక్ ఇస్తూ ఆప్ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో గుజరాత్ లో కూడా బీజేపీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది కేజ్రివాల్ సైన్యం. దాంతో గుజరాత్ లో ఈ ట్రైయాంగిల్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీ బలం తగ్గిందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బీజేపీ ఆదిపత్యంపై ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పాలన పరంగా కూడా కమలం పార్టీ ఘోరంగా విఫలం అయిందనే ప్రధాన విమర్శనస్త్రాలతో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ప్రచారం సాగించాయి.

మరోవైపు కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని, ఆమ్ ఆద్మీ పార్టీ అసలు తమకు పోటినే కాదని, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతుందని కమలనాథులు ప్రచారం సాగించారు. దీంతో హోరాహోరీగా జరిగిన ప్రచారాల పర్వం తరువాత నేడు జరుగుతున్నా ఓటింగ్ లో గుజరాత్ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీ మద్య పోరు కొనసాగేది.. అయితే ఈ సారి ఆప్ ఎంట్రీతో ప్రధాన పార్టీల ఓటు బ్యాంక్ కు భారీగా గండి పడే అవకాశం ఉంది. అయితే ఆప్ ఏ పార్టీ ఓటు బ్యాంకు ను చీల్చబోతుంది. ఆప్ ఎంట్రీ ఏ పార్టీకి లాభం చేకూరబోతుందని అనేది ఇప్పుడు నేషనల్ పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ. మరి చూడాలి గుజరాత్ లో జెండా పాతే పార్టీ ఏదనేది..

ఇవి కూడా చదవండి

లిక్కర్ క్వీన్ కవిత.. వాట్ నెక్స్ట్ కే‌సి‌ఆర్ ?

“బటన్ నొక్కుడు “.. ఇదేం పాలనరయ్యా !

చంద్రబాబుకు బెదిరింపులా.. నో ఛాన్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -