Monday, April 29, 2024
- Advertisement -

ఆసక్తి రేపుతున్న బీజేపీ మేనిఫెస్టో.. మరి ఫలితం ఎలా ఉంటుందో?

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి గుజరాత్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత పాతికేళ్ళకు పై గా గుజరాత్ లో బిజెపి హవా నడుస్తోంది. అయితే ఈసారి ప్రజల్లో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండడంతో.. కాషాయ పార్టీపై ప్రజా నిర్ణయం ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇక ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకొని గుజరాత్ లో పాగా వేయాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. దాంతో ఈ రసవత్తరమైన పోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు, ద్వారకా ఆలయం కారిడార్ నిర్మాణం వంటి హామీలను కమలనాథులు ప్రధానంగా హైలెట్ చేస్తున్నారు..

ద్వారక కారిడార్ నిర్మాణం కోసం గుజరాత్ ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక వీటితో పాటు యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, అలాగే మహిళలకు లక్ష ఉద్యోగాలు కేటాయించడం బీజేపీ ప్రదాన ఎజెండా అంటూ చెబుతున్నారు కమలనాథులు,. ఈ మేరకు బీజేపీకి సంబందించిన మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రిలీజ్ చేశారు. ఇక ఈ మేనిఫెస్టో ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పక్కా ప్రణాళికలను సిద్దం చేస్తోంది కాషాయపార్టీ. ఇక గత కొన్నాళ్లుగా గుజరాత్ లో కేవలం మోడీ మేనియాతోనే నెట్టుకొస్తున్న బీజేపీ.. ఈసారి కూడా మోడీనే నమ్ముకుంది. అయితే విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం గతంతో పోలిస్తే ఈ సారి బీజేపీకి బారిగా సీట్లు తగ్గే అవకాశం ఉందట. ఇక షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1న మొదటి విడత, 5న రెండవ విడత పోలింగ్ జరగనుంది. మరి ఈసారి గుజరాత్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

బాబుకు మోడీ పిలుపు.. బంధం బలపడేనా?

పవన్ ప్లాన్ అదుర్స్.. అక్కడే స్పెషల్ ఫోకస్?

బాబులగా వెన్నుపోటుతో కాదు.. స్వశక్తితో వచ్చా: జగన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -