Sunday, April 28, 2024
- Advertisement -

గుజరాత్ పై జెండా పాతేది ఎవరు.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి ?

- Advertisement -

గత కొన్ని రోజులుగా గుజరాత్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ఎట్టకేలకు గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఈసారి మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. 27 ఏళ్లుగా గుజరాత్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న బిజెపి ఈసారి కూడా విజయం సాధించని ఉవ్విళ్లూరగా.. ఈసారి ఎలాగైనా బిజెపికి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ మరియు కొత్తగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీలు గట్టి పట్టుదల చూపాయి. ఇక తాజాగా గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన నివేధికలు మరొకసారి బీజేపీ కే పట్టం కట్టాయి. మొత్తం మీద బీజేపీ 123 నుంచి 139 స్థానాల్లో తిరుగులేని మెజారిటీ సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఇక కాంగ్రెస్ కు 35 నుంచి 48 స్థానాలు , ఆప్ కు 4 నుంచి 9 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. .

దీంతో మరోసారి గుజరాత్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయబోతోందని స్పష్టమౌతోంది. అయితే గెలుపు విషయంలో బీజేపీ మొదటి నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బలంగా ప్రచారం చేశాయి. దాంతో ఈసారి గుజరాత్ ప్రజలు బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారా అనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. దాంతో ఎప్పుడు లేనంతగా ఈసారి గుజరాత్ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. అయితే కాంగ్రెస్, ఆప్ పార్టీల అంచనాలను తలకిందులు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ కే ఫేవర్ గా రావడంతో.. కమలా పార్టీకి గుజరాత్ లో తిరుగులేదనే మరోసారి రుజువైందీ. అటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపీ నే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి 33-39, కాంగ్రెస్ కు 27-32, అప్ 0-2 గా ఎగ్జిట్ పోల్స్ గణాంకాలూ చెబుతున్నాయి. మరి మొత్తానికి అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ, ఇటు గుజరాత్ లోనూ మోడీ మేనియాతో బీజేపీ దూసుకుపోతుందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ కు ఈసారి ఎన్నికలు కత్తి మీద సామే !

పవన్ యాక్టర్ గా సక్సస్.. పొలిటీషియన్ గా ఫెయిల్ !

జగన్ను ప్రశ్నించడమే నేరమా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -