Monday, May 20, 2024
- Advertisement -

రాజమౌళి దెబ్బకి బాలీవుడ్ లో దూకేసాడు

- Advertisement -

రాజమౌళి కి స్టూడెంట్ నెంబర్ 1 రోజుల నుంచే సుపరిచితం అయిన సెంథిల్ రాజమౌళికి ఒక ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా ఉండేవాడు. 

మొన్నటి బాహుబలి వరకూ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు అన్నీ ఒక్కటంటే ఒక్కటి కూడా ప్లాప్ గా పోకుండా సూపర్ హిట్లు గా నిలిచాయి. మగధీర తో సౌత్ లో పేరు తెచ్చుకున్న సెంథిల్ బాహుబలి దెబ్బకి బాలీవుడ్ లో ఫేమస్ అయిపోయాడు. ఈగ సినిమా సమయం లో కూడా జాతీయ స్థాయి లో సెంథిల్ కి గుర్తింపు వచ్చింది కానీ బాహుబలి లెక్క ఎంతైనా వేరు కదా. 

ఇప్పుడు సెంథిల్ కి చిన్నా చితకా ఆఫర్ కాదు ఏకంగా బాలీవుడ్ బాద్షా నుంచే ఆహ్వానం వచ్చింది. మొన్న రామోజీ ఫిలిం సిటీ లో దిల్వాలే సినిమా కోసం షూటింగ్ లో ఒక పాత చిత్రీకరణ చేసిన సెంథిల్ పని నచ్చిన షారూఖ్ తన తదుపరి సినిమా కి సినిమాటోగ్రఫీ అందించాలి అని కోరుతున్నాడట. 

ఈ సినిమా దర్శకుడి రోహిత్ శెట్టి కూడా సెంథిల్ పనితీరు తో చాల సంతోషంగా ఉన్నాడు అని రోహిత్ త్వరలో తీయబోయే  అక్షయ్  కుమార్ సినిమా లో సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా కనపడతాడు అంటున్నారు .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -