- Advertisement -

చరణ్ ఆలోచన సూపర్బ్

- Advertisement -

రాం చరణ్ సినిమా విడుదల తేదీ ప్రకటించాడు అంటే ఆ రోజున సినిమా వచ్చి తీరాలి, గోవిందుడు అందరి వాడెలే సమయం లో గతేడాది

ఇదే సమయానికి విడుదల దగ్గర పడుతూ ఉండగా సినిమా షూటింగ్ లో టాకీ పూర్తి అయ్యింది కానీ ఒక పాత పెండింగ్ ఉండిపోయింది అయినా సరే ఆ పాటని పక్కకి పెట్టి సినిమా ని ముందుగా ప్రకటించిన తేదీ లోనే విడుదల చేసాడు చెర్రీ. 

నిజానికి తెలుగు సినిమా కి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి . హాలీవుడ్ వారు సినిమా ల షూటింగ్ మొదలు కాకముందే విడుదల తేదీ లు ప్రకటించేస్తారు దాంతో మిగితా సినిమాల నిర్మాతలకీ , చిన్న సినిమాల వారికీ ఒక క్లారిటీ ఉంటుంది. ఒకే సమయం లో రెండు సినిమాలు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇబ్బందులు పడకుండా ఉంటాయి అనేది వారి ఆలోచన కానీ మనవారు అది సరిగ్గా పాటించరు.

 అక్టోబర్ 16 న వరల్డ్ వైడ్ గా తన బ్రూస్లీ సినిమా విడుదల కి సర్వం సిద్దం చేస్తున్నాడు చెర్రీ. శ్రీను వైట్ల ఒక పక్క 28 నుంచీ చిరంజీవి తో మూడు రోజుల షూటింగ్ మొదలు పెట్టబోతున్నరు.  సినిమా షూట్ ని మరో 10 రోజుల్లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తూనే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా స్పీడప్ చేసింది.

 ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ మరియు రీ రికార్డింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.  డబ్బింగ్ పనులు కూడా రాం చరణ్ మినహా అందరూ పూర్తి చేసారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -