Tuesday, April 30, 2024
- Advertisement -

బన్నీ – సాయి ల మధ్య దర్శకుడు!

- Advertisement -

పరిశ్రమలో ఓ హీరో స్టార్ రేంజ్ దక్కించుకోవాలంటే అది కేవలం హీరో స్టామినాతోనే కాదు దర్శకుల పనితనాన్ని బట్టి కూడా ఉంటుంది. పెద్ద సినిమా చిన్న సినిమా అని రెండు రకాలుగా సినిమాలను విభజిస్తున్న ప్రేక్షకులకు చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధిస్తే అది పెద్ద సినిమా అవుతుందని నిరూపించిన దర్శకుడు మారుతి. ఈరోజుల్లో లాంటి సంచలన సినిమాతో ట్రెండ్ క్రియేట్ చేసిన మారుతి భలే భలే మగాడివోయ్ తో సూపర్ హిట్ అందుకుని స్టార్ డైరక్టర్ ల లిస్ట్ లో చేరిపోయాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో బాబు బంగారం అంటూ రాబోతున్న మారుతి ఎప్పటినుండో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీయాలని కోరిక.

భలే మగాడు హిట్ కొడితే ఛాన్స్ ఇస్తా అని చెప్పిన బన్ని ఆ సినిమాతో మారుతి దర్శకత్వ ప్రతిభ కనబడ్డా సినిమా అవకాశాన్ని ఇవ్వలేదు. అయితే బాబు బంగారం తర్వాత మారుతి ఏ హీరోతో సినిమా చేస్తున్నాడన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అయితే బన్ని వెంట తను పడుతుంటే తన వెంటేమో మరో మెగా హీరో సాయి ధరం తేజ్ పడుతున్నాడట.  

తనకో సినిమా చేసి పెట్టాలని సాయి ధరం తేజ్ మారుతి మీద ఒత్తిడి తెస్తున్నాడట. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్ ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో చేయాలనే ఉత్సాహంతో ఉన్నాడట. మరి మారుతి సాయి ధరం తేజ్ కు అవకాశం ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాకు దర్శకుడు హరీష్ శంకర్ నిర్మించేందుకు ఇష్టపడుతున్నాడట. మెగా హీరోల్లో అతి తక్కువ టైంలోనే మెగా అభిమానుల మనసు గెలుచుకున్న సుప్రీం హీరో సాయి ధరం తేజ్ సుప్రీం సినిమాతో కెరియర్లో బెస్ట్ హిట్ అందుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -