- Advertisement -

రాజమౌళి కొడుకు ఏం చేస్తున్నాడు ?

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తండ్రి దగ్గరే దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అదే కాకుండా తను స్థాపించిన ఓ క్రియేటివ్ జోన్ నుండి సినిమా టీజర్లు, ట్రైలర్స్ కట్ చేస్తుంటాడు. బాహుబలి ది బిగినింగ్ లో కొన్ని సీన్స్ కార్తికేయ షూట్ చేశాడని అప్పట్లో అన్నారు. అయితే ఇప్పుడు కార్తికేయ కొండాపూర్ లో ఓ హోటల్ బిజినెస్ లో కూడా దిగాడట.

తన స్నేహితుడి సహకారంతో పెట్టిన ఈ హోటల్ పేరు సర్క్యూట్ అని పెట్టారు. ఎలాగు ఈ హోటల్ కు స్టార్స్ కళ ఉండనే ఉంటుంది. ఒక్కసారి రాజమౌళి ఈ హోటల్ కు వస్తే చాలు ఆ హోటల్ కు కావాల్సిననత పబ్లిసిటీ వచ్చేసినట్టే. త్వరలో దర్శకత్వం వైపు అడుగులేస్తాడనుకుంటే ఇలా సడెన్ గా బిజినెస్ స్టార్ట్ చేశాడేంటి అంటే..

ఇది రెగ్యులర్ గా చూసుకునే బిజినెస్ ఏం కాదు అది కాక తన స్నేహితుడు ఎలాగు ఉన్నాడు కాబట్టి తన దర్శకత్వానికి సంబందించిన విషయాల పట్ల ఈ బిజినెస్ ఎలాంటి డిస్టబన్స్ ఉండదట. అంతేకాదు త్వరలో మెగా ఫోన్ కూడా పట్టబోతున్నాడని అంటున్నారు. మరి దర్శక ధీరుడి తనయుడు అంటే ఆ లెగసీని కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -