Thursday, May 2, 2024
- Advertisement -

`బిగ్‌బాస్-2` లోకి హాట్ హీరోయిన్?

- Advertisement -

బిగ్ బాస్ -1 తో పోలిస్తే బిగ్ బాస్ -2కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేద‌ని టాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఈసారి హౌజ్ మేట్లలో పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ వారు లేక‌పోవ‌డం మైనస్ అయింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే, శ‌ని , ఆది వారాల్లో నాని…త‌న హోస్టింగ్ తో షోకు టీఆర్పీలు తెచ్చిపెడుతున్నాడు. తన పిట్టకథలతో ప్రేక్షకులను అల‌రిస్తూ షోను ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. అయితే, పాపుల‌ర్ అయిన సెలబ్రిటిస్‌ లేకపోవడం వ‌ల్ల షోకు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేద‌న్న‌ది ఓపెన్ సీక్రెట్. అయితే, షోకు కొద్ద‌గా గ్లామ‌ర్ అద్దే ప్ర‌య‌త్నంలో వైల్డ్‌కార్డు ద్వారా నందిని షోలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, శ్యామ‌ల ఎలిమినేష‌న్ త‌ర్వాత ….మ‌రో హాట్ హీరోయిన్ ను బిగ్‌బాస్‌ టీం వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా తీసుకోవాలనే యోచిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. కుమారి 21 ఎఫ్ ఫేమ్….హెబ్బా ప‌టేల్ కు వైల్డ కార్డ్ ఎంట్రీ ద‌క్క‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది.

`బిగ్‌ బాస్ 2`లో ఏమైనా జ‌ర‌గొచ్చు….అని నాని చెప్పిన‌ట్లుగానే షోలో అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. అనూహ్యంగా శ్యామల ఎలిమినేష‌న్ అయ్యారు. సామాన్యుల కేట‌గిరీలో ఎంట్రీ ఇచ్చిన సంజన, నూతన్ నాయుడు లు ఎలిమినేట్ కాగా….ఎలిమినేష‌న్ కోసం గణేశ్ సెల్ఫ్‌ నామినేట్‌ ​చేసుకున్నాడు. మ‌రో సెల‌బ్రిటీ కిరీటి దామ‌రాజు కూడా ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. అయితే, శ్యామ‌ల ఎలిమినేష‌న్ త‌ర్వాత షోకు హైప్ తేవాల‌ని బిగ్ బాస్ భావిస్తున్నాడ‌ట‌. అందుకే, హాట్ బ్యూటీ హెబ్బా ప‌టేల్ ను హౌజ్ లోకి లేవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఈ వార్త వైర‌ల్ అయింది. అయితే, ఇంత‌వ‌ర‌కు హెబ్బా ప‌టేల్ …బిగ్ బాస్ నిర్వాహ‌కులు …ఈ విషయాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ లేదు. మ‌రి, హెబ్బా ఎంట్రీ గురించి తెలియాలంటే…ఈ వీకెండ్ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -