Sunday, May 12, 2024
- Advertisement -

భారీ నష్టాలు మిగిల్చిన హలో సినిమా

- Advertisement -

అఖిల్ హ‌లో విష‌యంలో నాగర్జున ఎంత పోరాడిన ఫ‌లితం మాత్రం నిరాశే.త‌న కొడుకు అఖిల్ హ‌లో సినిమా విష‌యంలో అన్ని త‌నై న‌డిపించాడు నాగ‌ర్జున‌.వైజాగ్‌,హైద‌రాబాద్ లో ఈవెంట్స్ పెట్టి తెగ హ‌డ‌విడి చేశారు.అఖిల్ కూడా సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అమెరికా వెళ్లి మ‌రి డ్యాన్స్ ఈవెంట్ చేశాడు.విక్ర‌మ్ ద‌ర్శ‌కుడు కావ‌డం అంత‌కుముందు మ‌నం లాంటి క్లాసిక్ త‌మ ఫ్యామిలికి మ‌రిచిపోలేని హిట్ ఇవ్వ‌డంతో సినిమా చాలా రిచ్‌గా తీశాడు నాగ్‌.ఖ‌ర్చు కూడా బాగానే అయ్యింది సినిమాకు.

కాని రీలిజ్ త‌రువాత ప‌రిస్థ‌తి మారిపోయింది.సినిమా బాగుంది అనే టాక్ వ‌చ్చిన‌ప్ప‌టీకి క‌లెక్ష‌న్స్ మాత్రం తీవ్ర న‌ష్టాల‌ను మిగిల్చింది.దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే సినిమా రాబట్టిన కలెక్షన్లు మొత్తం కూడా 10 కోట్లేనట. అంటే 22 కోట్ల వరకు సినిమా నష్టాల్ని మిగిల్చింది. ఏరియాల వారిగా భారీ మొత్తాలను వెచ్చించి సినిమాను కొన్న బయ్యర్లు ఇప్పుడు నాగార్జునను నష్టాలను భరించాల్సిందేనని అడుగుతున్నారట.

దీంతో నాగ్ ‘హలో’ సినిమాను కొన్న బయ్యర్లకు అతి తక్కువ రేట్లకు తన బ్యానర్ లో నిర్మించిన ‘రంగులరాట్నం’ సినిమాను అమ్మినట్లుగా సమాచారం.వాస్తవానికి ‘రంగులరాట్నం’ సినిమా హలో సినిమాకు వచ్చిన భారీ నష్టాల్ని తీర్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రాజ్ తరుణ్ సినిమా ఘన విజయాన్ని అందుకున్నా.. పాతిక కోట్లు కలెక్షన్లు రావడం మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. అందులోనూ.. ఈ చిన్న సినిమా పవన్ ‘అజ్ఞాతవాసి’, బాలయ్య ‘జై సింహ’ చిత్రాలతో పోటీ పడి మరీ బరిలో నిలవాలి. మరి రాజ్ తరుణ్ ఆ రేంజ్ సక్సెస్ అందుకొని హలోకి వచ్చిన నష్టాల్ని తీరుస్తాడో లేదో చూడాలి!

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -