Thursday, April 25, 2024
- Advertisement -

హలో గురు ప్రేమ కోసమే దుబాయ్ రివ్యూ

- Advertisement -

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్ కెరీర్ ఒక హిట్ ,రెండు ప్లాప్‌లుగా సాగుతుంది.రామ్ మొద‌టి నుంచి ఒక హిట్ ఇచ్చిన వెంట‌నే రెండు ప్లాప్‌లు ఇస్తున్నాడు.ఉన్నది ఒకటే జిందగీ వంటి హిట్ త‌రువాత రామ్ న‌టిస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. ఈ చిత్రానికి నేను లోకల్ దర్శకుడు త్రినాథ రావు నక్కిన డైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై లక్ష్మణ్, దిల్ రాజు, హర్షిత్ రెడ్డి, శిరీష్ సంయుక్తంగా రూపొందించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ కానున్నది.ఈ సినిమాతో రామ్ ఎలాగైనా హిట్ కొట్ట‌ల‌నే క‌సితో ఉన్నాడు.ఇప్ప‌టికే ఈ సినిమా యూఎస్‌,దుబాయ్‌లలో విడుద‌లైంది.అక్కడ వారు సామాజికి మాధ్య‌మాల ద్వారా సినిమా ఎలా ఉందో తెలియ‌జేస్తున్నారు.మ‌రి హలో గురు ప్రేమ కోసమే సినిమా రామ్‌కు మ‌రో హిట్ ఇచ్చిందో లేదో మ‌నం కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

హలో గురు ప్రేమ కోసమే చిత్రం ఓ రొమాంటిక్ లవ్ స్టోరి. రామ్ పోతినేని సంజు అనే పాత్రలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కనిపించనున్నారు. ఓ గ్రామం నుంచి అను (అనుపమ పరమేశ్వరన్) ప్రేమను గెలుచుకోవడానికి పట్టణానికి వస్తాడు. గ్రామీణ నేపథ్యంగా కథ ఓ పది నిమిషాలు కొనసాగుతుంది.హలో గురు ప్రేమ కోసమే చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, ప్రణిత యాక్టింగ్, గ్లామర్ అదనపు ఆకర్షణగా మారనున్నాయి. ప్రకాశ్ రాజ్, మహేష్ ఆచంట, సితార, జయప్రకాశ్, పోసాని కృష్ణ మురళీ, సత్య, సురేష్ పాత్రలు కథకు బలంగా మారనున్నాయి.ప్రకాశ్ రాజ్ పాత్ర ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నది. అనుపమ పరమేశ్వరన్ తండ్రి పాత్రలో రామ్‌కు మామగా ఓ ప్రత్యేకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు.

హస్యంతోపాటు ఫ్యామిలీ విలువలను చెప్పే చిత్రమనే టాక్ వినిపిస్తున్నది.హలో గురు ప్రేమ కోసమే పక్కా కుటుంబ కథా చిత్రంగా రూపొందిందనే మాట వినిపిస్తున్నది. పండుగ నేపథ్యంలో ప్రేక్షకులకు ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించామని నిర్మాతలు వెల్లడించారు. ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేయడం గ్యారంటీ అంటున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది.హలో గురు ప్రేమ కోసమే చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సంతృప్తికరంగా జరిగినట్టు ట్రేడ్ రిపోర్ట్. సుమారు రూ.25 కోట్ల మేర ఈ చిత్ర బిజినెస్ జరిగిందని, రామ్ స్టామినాను పరిశీలిస్తే ఇది సేఫ్ ప్రాజెక్ట్ అనే మాట వినిపిస్తున్నది.సినిమాను చూసిన ప్ర‌తి ఒక్క‌రు హాయిగా న‌వ్వుకుంటార‌ని సినిమా యూనిట్ భావిస్తుంది.సినిమా పూర్తి రివ్యూ మ‌రి కొద్దిసేప‌ట్లో మీ ముందు ఉంటుంది.

 

 

ram,anupam

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -