Thursday, May 16, 2024
- Advertisement -

త‌త్లీ వెల్లింది….ఇప్పుడు గ‌జా వ‌స్తోంది

- Advertisement -

తిత్లీ తుపాను దెబ్బకు ఇంకా కోలుకోలేని శ్రీకాకుళంకు మరో షాక్ తగలనుందా ? ఇలాంటి సమయంలో మరో తుపాను సిక్కోలును వణికించనుందా..? ప్రస్తుతం శ్రీకాకుళం ప్రజలు ఇదే విషయమై ఆందోళనవ్యక్తంచేస్తున్నారు. 23కల్లా ఉత్తర అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నదని భారత వాతావరణ శాఖ బుధవారం తెలపింది. దీంతో సిక్కోలు ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు.

ఇప్ప‌టికే తిత్తీ తుఫాన్ సిక్కోలును అత‌లా కుత‌లం చేసింది. తుఫాన్ ధాటికి శ్రీకాకులం ప్ర‌జ‌లు స‌ర్వ కోల్పోయి రోడ్డున ప‌డ్డారు. ఇప్పుడు మ‌రో తుఫాన్ గండం పొంచి ఉండ‌టంతో భ‌యం గుప్పిట్లో గ‌డుపుతున్నారు ప్ర‌జ‌లు. అల్పపీడనం తొలుత బలపడి వాయుగుండంగా మారుతుంది. ఆతర్వాత తుపానుగా మారినప్పుడే దాని గమనం తెలుస్తుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈలోగా దానిపై ఎలాంటి స్పష్టత రాదన్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బంగాళాఖాతంలో వాతావరణం, గాలుల తీవ్రత తదితర అంశాలపై ఆధారపడి దాని పయనం ఉంటుందన్నారు. ఈసారి తుపాను వస్తే దానిక గజ అనే పేరే పెడతామన్నామ‌ని అధికారులు తెలిపారు.

మరోవైసు గజా సైక్లోన్ తుపాను వార్తలు విని సిక్కోలు వాసులు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికీ తిత్లీ ధాటికి జిల్లా తీవ్రంగా నష్టపోయింది. వందలాది ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. ఇలాంటి సమయంలో మళ్లీ తుపాను అంటే… భయపడిపోతున్నారు జనం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -