Saturday, May 18, 2024
- Advertisement -

నా ఎలిమినేషన్ కి వారే కారణం అంటున్న హేమ

- Advertisement -

ఈమధ్యనే మొదలైన బిగ్ బాస్ సీజన్ 3 హౌస్ మేట్స్ మధ్య గొడవలతో రసవత్తరంగా సాగుతోంది. మొదటి వారంలో ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన ఆరుగురిలో హేమ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన హేమ బిగ్ బాస్ గురించి మరియు కంటెస్టెంట్ ల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఇంట్లో జరిగినది ఉన్నది ఉన్నట్టు చూపించకుండా బిగ్ బాస్ వారు కేవలం కొన్ని సీన్లను మాత్రమే చూపిస్తున్నారని హేమ ఆరోపించారు. అంతేకాకుండా శ్రీముఖి వంటి కంటెస్టెంట్ లందరూ ఒకటిగా మారి తనను ఇంట్లో నుంచి పంపించేశారని హేమ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లేముందు రాయించుకున్న కాంట్రాక్ట్ లో ప్రెగ్నెన్సీ క్లాజ్ కూడా పెట్టారని హేమా బయటపెట్టింది. ఏదేమైనా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన ఆమె చేస్తున్న కామెంట్లు బిగ్బాస్ పై మరింత ఆసక్తి పెంచుతున్నాయనే చెప్పుకోవాలి. మరోవైపు ఈ వారం నామినేషన్స్ లో హిమజా, శ్రీముఖి, పునర్నవి, వరుణ్ సందేశ్, వితిక, రాహుల్, బాబా భాస్కర్ మరియు జాఫర్ లు ఉన్నారు. మరి ఈ వారం ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోతున్నారో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -