Thursday, May 9, 2024
- Advertisement -

‘మిస్ట‌ర్ మ‌జ్ను’గా అఖిల్‌

- Advertisement -

అక్కినేని వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు.మొద‌టి సినిమాతో ఘోర‌మైన ప్లాప్ ఇచ్చాడు అఖిల్‌.దీంతో రెండో సినిమాకు కొంత గ్యాప్ తీసుకుని హ‌లో మూవీ చేశాడు.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ ఫెయిల్ కావడంతో ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య స్థితిలో ఉన్న అఖిల్‌కు తొలిప్రేమ లాంటి డిసెంట్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి క‌నిపించాడు.ప్ర‌స్తుతం అత‌నితో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్‌.ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల‌లో తెర‌కెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ న‌డుస్తుంది.సినిమా ల‌వ్ స్టోరి కావ‌డంతో సినిమాకు మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ నిర్ణ‌యించార‌ని స‌మాచారం.నాగ‌ర్జున న‌టించిన మ‌జ్ను సినిమా పెద్ద హిట్ అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఈ సెంటిమెంట్‌తోనే ఈ సినిమాకు మిస్ట‌ర్ మ‌జ్ను అని పెట్టార‌ని తెలుస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ న‌టిస్తుంది.నిధి అగర్వాల్ నాగ‌చైత‌న్య సినిమాలో కూడా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -