Saturday, May 18, 2024
- Advertisement -

పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న బ‌న్నీ

- Advertisement -

హీరో అల్లు అర్జున్ పొలిటిక‌ల్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకుంటున్నాడు.అయితే ఇది నిజ‌మైన రాజ‌కీయ‌ల‌లో కాదులేండీ.అల్లు కొత్త సినిమాలో రాజ‌కీయ నాయ‌కుడిగా క‌నిపించునున్నాడని స‌మాచారం.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…అల్లు అర్జున్ ఎన్నో అంచ‌నాలు పెట్టుకుని న‌టించిన నా పేరు సూర్య మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో త‌న తదుప‌రి సినిమాపై డైలామాలో పడ్డాడు.విక్ర‌మ్ కుమార్‌తో సినిమా అని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టికి ఆయ‌న‌కి సూప‌ర్ హిట్లు ఇచ్చిన సినిమాలు లేక‌పోవ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య‌స్థితిలో ఉన్నాడు బ‌న్నీ.దిల్ రాజుతో ‘స‌భ‌కు న‌మ‌స్కారం’ అనే సినిమా చేస్తున్నాడ‌ని వార్తలు వ‌చ్చిన వాటిని ఖండిచాడు నిర్మాత దిల్ రాజు.

బ‌న్నీతో ఇప్ప‌ట్లో సినిమా లేద‌ని ప్ర‌క‌టించాడు దిల్ రాజు.తాజాగా బన్నీకి సంతోష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఓ కథ వినిపించినట్లు సమాచారం. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని తెలుస్తోంది. ఈ కథ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో బన్నీ కూడా సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని టాక్.సింగిల్ సిట్టింగ్ లో బన్నీని ఇంప్రెస్ చేశాడట సదరు కొత్త డైరెక్టర్. ఈ మధ్యకాలంలో పొలిటికల్ కథలు బాగా క్లిక్ అవుతుండడంతో ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే వర్కవుట్ అవుతుందని బ‌న్నీ భావిస్తున్నాడు.దీంతో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌తో సినిమా ఆపేసి కొత్త ద‌ర్శ‌కుడితో సినిమాను మొద‌లెట్ట‌ల‌ని బ‌న్నీ ఆలోచ‌న‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -