Sunday, May 19, 2024
- Advertisement -

జనం సొమ్ము రూ 5వేల కోట్లు స్వాహా

- Advertisement -

పెద్దనోట్లు రద్దుతో అవినీతి అంతమైపోతుందని చందమామ కథ చెప్పారు. మోడీ నిజంగా మొనగాడేనని జనం జేజేలు పలికారు. ఎవరి కష్టార్జితం వారు తెచ్చుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టారు. ఆ క్యూలో ఉంటూనే ఇండియా ఇక సింగపూరేనని కలలు కన్నారు. ఎంతో ఓపిక, సహనంతో మోడీ నిర్ణయాన్ని స్వాగతంచారు. కానీ ఇప్పటికీ నోట్ల రద్దు కష్టాలు తీరలేదు. పైగా బ్లాక్ మనీ విదేశాలను తెచ్చేస్తాం. ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయు వేస్తామని చెప్పారు. ఖాతాలో డబ్బులు వేయడం సంగతి పక్కనబెట్టు. మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో మహా దోపిడీకి మోడీ హయాంలో బ్యాంకులు తెరలేపాయి. బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ లేదన్న సాకుతో ఖాతాదారుల నుంచి బ్యాంకులు రూ.5 వేల కోట్లు దోపిడీ చేశాయి. 21 ప్రభుత్వ, మూడు మేజర్‌ ప్రైవేటు బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో మినిమమ్ బ్యాలెన్స్‌ ఉంచలేదన్న సాకుతో ఈ మహా దోపిడీకి పాల్పడ్డాయి. అత్యధికంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2,433.87 కోట్లు వసూలు చేసింది. హెచ్‌డీఎఫ్ సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో పేదల సొమ్మును భోంచేశాయి. కనీస బ్యాలెన్స్ కూడా ఉంచుకోలేకపోతున్నారు అంటే పేదలనే కదా అర్ధం.. విద్యార్ధులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, రైతులు, రైతు కూలీలు, ఇతర చేతివృత్తి పనులు చేసుకునే పేదవారే మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉంచలేని స్థితిలో ఉంటారు. అలాంటి పేదవారి సొమ్మను ఈ బ్యాంకులు ఇంత దారుణంగా దోచుకుంటుంటే మోడీ సార్ చోద్యం చూస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏటీఎం మెయింటినెన్స్ చార్జీలు పేరుతో మరో దోపిడీ. ప్రతి ఖాతాదారుడు ఏటీఎం వాడుతున్నందుకు వందల్లో వసూలు చేస్తున్నారు. అలా దోచుకుంటున్నదీ వేల కోట్లలోనే లెక్క తేలుతోంది.

పోనీ మోడీ సర్కార్ ఇలా పేదల సొమ్మును బ్యాంకుల ద్వారా దోచుకుంటుూ అవినీతిని అంతం చేసేశారా ? అంటే అదీ లేదు. నోట్ల రద్దు చేసినా ఎప్పటిలాగే అక్రమార్కుల ఇళ్లల్లో కోట్ల రూపాయల కొత్త నోట్లు కొలువుదీరాయి. గతంలో కోటి రూపాయలు 10 సూట్ కేసుల్లో పెడితే ఇప్పుడు ఒకే సూట్ కేసులో పెట్టుకుంటున్నారు. అవినీతి ఏమాత్రం తగ్గలేదు కదా, పదింతలు పెరిగిందనేది స్పష్టమవుతోంది. ఏసీబీకి దొరుకుతున్న అక్రమార్కుల ఆస్తులు 100 నుంచి వేల కోట్లలో ఉంటున్నాయి.

పోనీ డిజిటల్ లావాదేవీలు చేయలేని ప్రజలు బ్యాంకులకు వెళ్తే డిపాజిట్ మిషన్లు, ఏటీఎంలు సరిగా పని చేయవు. బ్యాంక్ సిబ్బంది సహకారం అస్సలుండదు. ఏమైనా అంటే సర్వర్ డౌన్ అయింది. స్లో అయింది. కంప్యూటర్స్ హేంగ్ అయ్యాయి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దీంతో ఇప్పటికీ వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాలన్నా, విత్ డ్రా చేయాలన్నా జనం నానా అవస్థలు పడుతున్నారు. వేరే ఊరిలో ఉన్న వ్యక్తి అకౌంట్ లోకి డబ్బులు పంపాలంటే వారి ఏటీఎం కార్డు డిపాజిట్ చేసే వ్యక్తి వద్ద ఉండాలని ఓ దిక్కుమాలిన రూలు పెట్టారు. డబ్బులు అవసరమైన వ్యక్తి ఏటీఎం కార్డు డిపాజిట్ చేసే వ్యక్తి వద్ద ఉంటే, అవతలి వ్యక్తి ఆ డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలి ? మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగాలా ? చలానాతో విత్ డ్రా చేసుకోవాలా ? ఏదైనా బ్యాంకుకు వెళ్లి సేమ్ బ్యాంకు ఖాతాలో అమౌంట్ డిపాజిట్ చేయడానికి వీల్లేదు. మీ అకౌంట్ ఏ ఊరిలో ఏ బ్రాంచ్ లో ఉంటే అదే ఊరిలో అదే బ్రాంచ్ కు వెళ్లి, అంటే హోమ్ బ్రాంచ్ బ్యాంకుకు వెళ్లి మాత్రమే డిపాజిట్ చేయాలంట. ఈ రూల్స్ ఏంటో ? ఎందుకు పెట్టారో ? మోడీ కాదు కదా ఏ బ్యాంకరూ చెప్పడు. కానీ మినిమమ్ బ్యాలెన్స్, ఏటీఎం మెయింటినెన్స్ పేరుతో మాత్రం కోట్లకు కోట్లు దోచుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -