Tuesday, May 21, 2024
- Advertisement -

ఆర్వోసీ వద్ద ఉన్న సమాచారమే చార్జ్ షీట్ లో ఉంది…

- Advertisement -

జ‌గ‌న్‌పై ఉన్న అవినీతి ఆరోప‌ణ‌ల కేసులు ఇబ్బంది క‌రంగా మారాయి. అధికార‌పార్టీ నాయ‌కుల‌కు ఆయుధంగా మారుతున్నాయి. బాబునుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్నావారే. జ‌గ‌న్‌పై ఉన్న కేసులేవి నిల‌బ‌డ‌వ‌ని ప‌లువురు నేత‌లు వ్యాఖ్యానిస్తున్నా టీడీపీ మాత్రం అదే మైండ్ గేమ్ ఆడుతోంది. గ‌తంలో జ‌గ‌న్‌పై ఉన్న అవినీతి ఆరోప‌న‌ల కేసుల‌గురించి సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన ఉండ‌వ‌ల్లి అరుణ‌కుమార్ తాజాగా మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జగన్ పై ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులేవీ ఆయన్ను జైలుకు పంపించేంత పెద్ద కేసులేవీ కాద‌న్నారు. మొద‌టి నుంచీ ఇదే చెప్తున్నాన‌ని తెలిపారు. జగన్ పై దాఖలైన చార్జ్ షీట్లలో ఉన్నదంతా ఆర్వోసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్) వద్ద ఉన్న సమాచారమేనని చెప్పిన ఉండవల్లి, ఏదైనా తప్పు జరిగిందని తేలితే కేవలం జరిమానా మాత్రమే పడుతుందే తప్ప, జైలుకు వెళ్లే పరిస్థితులు తలెత్తవని ఆయన స్పష్టం చేశారు.

చార్జ్ షీట్ లోని సమాచారంలో ఏదీ విచారించి కనుగొన్నది కాదని చెప్పిన ఆయన, తన ఉద్దేశంలో జగన్ నేరస్తుడని చెప్పే ఆరోపణలు, దాన్ని నిరూపించే ఆధారాలు ఈ కేసుల్లో లేవన్నది తన అభిప్రాయమని ఉండవల్లి చెప్పారు. ఇండియాలో ఇంతవరకూ ‘క్విడ్ ప్రొకో’ అన్న కేసు నిరూపితమైన ఘటన ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -