Wednesday, May 1, 2024
- Advertisement -

భ‌యాందోల‌న‌లో గ్రామ‌ప్ర‌జ‌లు…దీని వెనుక పాకిస్థాన్ హ‌స్తం ఉందా..

- Advertisement -

హ‌ర్ర‌ర్ సినిమాల్లో దుష్ట‌శ‌క్తులు చేసె వికృత చేష్ట‌ల‌ను చూస్తుంటాం.అది సినిమాలో మాత్రమే.కాని దెయ్యాల సినిమాల్లో జ‌రిగె సీన్లు ఆ గ్రామంలో రియ‌ల్‌గా జ‌రుగుతున్నాయి.దీంతో గ్రామ‌స్తులు బిత్త‌ర‌పోతున్నారు.నిద్ర‌పోవాలంటెనె భ‌య‌ప‌డిపోతున్నారు. వ‌రుస‌గా సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌టంతో ఆవార్త వైర‌ల్‌గా మారింది.చివ‌రికి పోరెన్స్‌క్ వైద్యులు సైతం అక్క‌డికి వ‌చ్చారు.

త్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీల్లో మహిళల జుట్టు కత్తిరింపుకు గురౌతున్న వరుస ఘటనల వెనుక దెయ్యం ఉందని ఆగ్రా సమీపంలోని ఓ గ్రామ ప్రజలు భయపడుతున్నారు. కొన్ని ఇళ్లలో వారికి అండగా మగవారు తమ దుకాణాలను మూసేసి ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. ఇళ్ల ద్వారాలకు, కిటికీలకు నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు కడుతున్నారు.

దుష్ట శక్తే నా జుట్టును కత్తిరించింది’ అని 65 ఏళ్ల విమలా దేవి ఆ గ్రామాన్ని సందర్శించిన మీడియాకు తెలిపింది. విమలా దేవీకి ఉదయం వేళ గుర్తుతెలియని శక్తులు జుట్టును కత్తిరించగా, మిగతా ఇద్దరు మహిళలకు రాత్రి ఏడున్నర గంటల నుంచి 11.30 గంటల మధ్య జుట్టును కత్తిరించారు.

అయితే బాధితులు చెప్తున్న వివ‌రాలు న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని పోలీస్ అధికార‌లు చెప్తున్నారు.మంగళవారం నాడు ఫోరెన్సిక్‌ నిపుణులు ముగ్గురు బాధితుల ఇళ్లకు వచ్చి వారికి కావాల్సిన అవశేషాలను, వేలి ముద్రలను తీసుకెళ్లారు. ఒక్క ఢిల్లీ పరిసర గ్రామాల్లోనే కాకుండా హర్యానా, రాజస్థాన్‌ గ్రామాల్లోనూ ఇలాంటి జుట్టు కత్తిరింపు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ర్‌గావ్‌లోని బిస్రూ గ్రామానికి చెందిన హర్షద్‌ ఖాన్‌ అనే గాయకుడు ‘చోటియా కత్‌నే కా సచ్‌ (జుట్టు కత్తిరింపు వెనకనున్న నిజం)’ అని పాటను పాడి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు.జుట్టు కత్తిరింపు బాధితుల్లో హిందువులు, ముస్లింలు ఉన్నందున విదేశీ కుట్ర ఉండవచ్చంటూ ఆయన పాట సాగుతుంది. కంగన్‌ హేరి గ్రామంలో కూడా వృద్ధులు సమావేశమై జుట్టు కత్తిరింపు సంఘటనల వెనక పాకిస్థాన్‌ హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఇది ఎంత‌మేర‌కు నిజ‌మే దేవుడికే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -