Thursday, April 25, 2024
- Advertisement -

మోహన్ లాల్ ‘మరక్కర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

- Advertisement -

ఈ మద్య టాప్ దర్శక, నిర్మాతలు ఎక్కువగా పిరియాడికల్ చిత్రాలకు పెద్ద పీట వేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాలు పాన్ ఇండియాగా రూపొందుతున్నాయి. ఇలాంటి చిత్రాలు హిట్ కొడితే కలెక్షన్లు కూడా అంతే స్థాయిలో రాబడుతున్నాయి. తాజాగా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ‘మరక్కర్‌’.. లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ అనేది టాగ్ తో రూపొందుతుంది. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో పలు విభాగాల్లో విజేతగా నిలిచింది.

ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనావల్ల ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ తదితర భాషల్లో ఆగస్టు 12న ఈ చిత్రాన్ని అధికారికంగా విడుదల చేయాలనుకున్నట్లుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రం 100 కోట్ల బడ్జెట్ తో ఆంటోని పెరంబవూర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ‘ఓనమ్’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా వదిలారు.

సునీల్ శెట్టి , యాక్షన్ కింగ్ అర్జున్, ప్రభు కీలకమైన పాత్రలను పోషించారు. ఇక ముఖ్యమైన పాత్రల్లో కీర్తి సురేశ్,మంజు వారియర్,సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ కూడా నటించాడు. ఈ చిత్రం రిలీజ్ కోసం మోహన్ లాల్ తనయుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -