Friday, April 26, 2024
- Advertisement -

మహేశ్‌, ప్రభాస్‌ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన సుబ్బరాజు!

- Advertisement -

ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో వివిధ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటులలో కార్తీక్ సుబ్బరాజు ఒకరు. పాత్ర ఏదైనా నిబద్ధతతో పని చేస్తూ గత 18 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సుబ్బరాజు తాజాగా ఓ క్లబ్‌హౌస్‌ సెషన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు,పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తెరపై ఈ హీరోలు ఎలా ఉన్నప్పటికీ తెరవెనుక మాత్రం వీరి మనస్సు ఎంతో సున్నితత్వం అని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ గురించి మాట్లాడుతూ… మహేష్ బాబు చూడటానికి చాలా సున్నితంగా కనిపిస్తారు కానీ తెరవెనుక మాత్రం అతడు చేసే ఏ పనిలోనైనా ఖచ్చితత్వం ఉండాల్సిందే. మహేష్ బాబు ఏ పని చేసినా ఎంతో ఫర్‌ఫెక్ట్‌గా చేయాలని కోరుకుంటారు. మహేష్ బాబుతో కలిసి పోకిరి, శ్రీమంతుడు, దూకుడు వంటి చిత్రాలలో సుబ్బరాజు నటించారు.

Also read:ఒక్కటవుతున్న రష్మీ, అనసూయ.. క్రేజి ప్రాజెక్టుకు సై!

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ చూడటానికి కఠినంగా కనిపించినప్పటికీ తెరవెనుక మాత్రం ఎంతో సరదాగా ఉంటారు. అందరితోనూ సరదాగా మాట్లాడుతూ కలివిడిగా ఉంటారు. ప్రభాస్ తో కలిసి పని చేయాలంటే ఎంతో సరదాగా అనిపిస్తుంది అని చెప్పారు. సుబ్బరాజు ప్రభాస్ కలిసి మిర్చి, బాహుబలి, బుజ్జిగాడు వంటి చిత్రాలలో నటించారు.

Also read:మళ్ళీ టాలీవుడ్ కు రానున్న అలియా భట్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -