Thursday, March 28, 2024
- Advertisement -

థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది.. తాజా సర్వే వివరాలు ఇవే!

- Advertisement -

కరోనా వైరస్ వివిధ రూపాలలో పరివర్తనం చెందుతూ తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే మొదటి వేవ్, రెండవ దశ దేశం పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి భారత్ క్రమంగా బయటపడుతోంది. అదేవిధంగా కరోనా మూడవ దశ కూడా తప్పదని దాని ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరించడంతో అన్ని దేశాలు మూడవ దశ మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యాయి.

ఈ క్రమంలోనే మూడవ దశ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది. మూడవ దశ ఎప్పుడు వ్యాపిస్తుంది అనే అంశంపై లోకల్‌ సర్కిల్స్ సోషల్ మీడియా వేదికపై నిర్వహించిన సర్వే నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా మూడవదశ అనుకున్న సమయానికంటే ముందుగానే దేశంలో వ్యాప్తి చెందుతుందని ఈ నివేదిక వెల్లడించింది.ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Also read:ఒక్కటవుతున్న రష్మీ, అనసూయ.. క్రేజి ప్రాజెక్టుకు సై!

ఈ విధంగా లాక్ డౌన్ నిబంధనలను తొలగించటం వల్ల జనాలు అధిక మొత్తంలో గుంపులుగా గూమి కూడే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా పలు రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఓపెన్ కావడంతో అధిక మొత్తంలో జనసందోహం ఏర్పడుతుంది ఈ క్రమంలోనే వైరస్ మరింత రూపాంతరం చెంది మూడవదశ అనుకున్న సమయం కంటే ముందుగానే వ్యాపిస్తుందని ఈ సర్వే వెల్లడించింది. దేశం పై కరోనా మూడవ దశ అక్టోబర్,నవంబర్ నెలలో రావచ్చని అంచనా వేసినప్పటికీ ఈ లోకల్ సర్వే ఫలితాలు మాత్రం అనుకున్న సమయం కంటే రెండు నెలలు ముందు కాని దేశంలో థర్డ్ వేవ్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నాయి.

Also read:మళ్ళీ టాలీవుడ్ కు రానున్న అలియా భట్..?

ఏదిఏమైనప్పటికీ లాక్ డౌన్ నిబంధనలు తొలగించిన తరువాత ప్రజలందరూ ఎక్కువగా బయట తిరగకుండా, అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం ముఖ్యమని ఈ సందర్భంగా నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -