దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,903 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా టీకా పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 3,50,64,536 డోసులు వేసినట్లు చెప్పింది.
ఇక కరోనా వైరస్ ప్రబలిపోతున్న నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పని సరి అంటున్నారు ప్రభుత్వం. సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేస్తూ శానిటైజర్ తమ వద్ద ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో సెలబ్రెటీలు వరుసగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా కింగ్ నాగార్జున వ్యాక్సిన్ తీసుకున్నారు. ఓ ప్రైవేటు హాస్పిటల్ లో టీకా మొదటి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు.
‘నిన్న నేను కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో (cowin.gov.in) రిజిస్టర్ చేసుకుని, టీకా వేయించుకోవాలి’ అని కోరారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.