భారత్​ ఓకే అంటే వ్యాక్సిన్​ డోసులు ఇస్తాం: అమెరికా

- Advertisement -

అత్యధిక జనాభా ఉన్న మనదేశంలో ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్​ ఇవ్వడం అనేది కొంత కష్టసాధ్యమైనదే. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్​ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. మనదేశంలోనే రెండు కంపెనీలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వ్యాక్సిన్​ డోసుల ఉత్పత్తి గణనీయంగా సాగడం లేదు. వ్యాక్సినేషన్​ ప్రక్రియ కాస్త మందకొడిగానే సాగుతోంది. మనదేశానికి వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఇండియా అంగీకరిస్తే అమెరికా నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేస్తామంటూ అమెరికా ప్రకటించింది.

ఈ మేరకు ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి నెడ్​ ఫ్రైస్​ ఓ ప్రకటన చేశారు.వ్యాక్సిన్​ డోసులు తీసుకొనేందుకు భారత్​ ఇంకా గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. టీకాలు విదేశాల నుంచి స్వీకరించే విషయంలో భారత్​ చట్టపరమైన అంశాలను పరిశీలిస్తోందని ఆయన అన్నారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా భారీ ఎత్తున వ్యాక్సిన్​ డోసులను నిల్వ చేసుకున్నది. వీటిలో 80 మిలియన్​ డోసులు వివిధ దేశాలకు పంపేందుకు అధ్యక్షుడు బైడెన్​ అంగీకారం తెలిపారు.

- Advertisement -

దీంతో నేపాల్​, పాకిస్థాన్​, భూటాన్​, బంగ్లాదేశ్​ సహా పలు దేశాలకు 40 మిలియన్​ డోసుల టీకాల పంపిణీ చేయాలని ఆ దేశం నిర్ణయించుకున్నది.అయితే ఈ విషయంపై అమెరికా విదేశాంగ ప్రతినిధులు మాట్లాడుతూ.. ’ ప్రస్తుతం ఇండియా ఫార్మా రంగంలో దూసుకుపోతున్నది. ఆ దేశం స్వయంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నది. విదేశాలకు కూడా పంపుతున్నది’ అని పేర్కొన్నారు. కాగా అమెరికాలో ఫైజర్​, మోడెర్నా వంటి వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్న విషయం తెలిసిందే.

Also Read

భారత్​లో తొలి కరోనా పేషెంట్​కు మళ్లీ పాజిటివ్​..!

థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -