చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్​..

- Advertisement -

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్​ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్​ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో త్వరలో థర్డ్​వేవ్​ వస్తుందని.. చిన్నపిల్లలకు ఎక్కువ ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. తాజాగా కేంద్రం చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్​ ఇస్తామని తెలిపింది.

జైడస్ క్యాడిల్లా సంస్థ రూపొందించిన డీఎన్ఏ ఆధారిత జైకోవ్-డీ (ZyCoV-D) కరోనా వ్యాక్సిన్‌ 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుపుతోందని, ఈ ట్రయల్స్ పూర్తయితే చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

దేశంలో వ్యాక్సినేషన్​ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ చిన్నపిల్లలకు వ్యాక్సిన్​ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఈ విషయంపై ఓ బాలుడు కోర్టుకు వెళ్లాడు. చిన్నపిల్లలకు వ్యాక్సిన్​ ఎందుకు ఇవ్వడం లేదని టియా గుప్తా అనే బాలుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్​ వేశాడు. ఈ పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈరోజు ఈ విషయంపై వాదనలు జరగగా కేంద్రప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.

Also Read : ఆక్సిజన్​ బాటిల్స్​ వచ్చేశాయి.. జేబులో పెట్టుకోవచ్చు

అహ్మదాబాద్​కు చెందిన జైడస్ క్యాడిల్లా అనే సంస్థ చిన్నపిల్లల కోసం ఓ వ్యాక్సిన్​ను తయారుచేస్తోందని కేంద్రం హైకోర్టుకు వివరించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్​ కు సంబంధించిన క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతున్నాయని.. ట్రయల్స్​ పూర్తికాగానే వ్యాక్సిన్​ పంపిణీ మొదలుపెడతామని కేంద్రం హైకోర్టుకు తెలిపింది.

ట్రయల్స్​ పూర్తయ్యాక ఈ వ్యాక్సిన్​కు సంబంధించిన అనుమతులు జారీచేస్తామని కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నది. కానీ చిన్నపిల్లలకు మాత్రం వ్యాక్సిన్​ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో చిన్నపిల్లలకు వ్యాక్సిన్​ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది.

Also Read : థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -