ఆన్‌లైన్‌లో వల్ల ఎంతటి సౌకర్యం ఉంటుందో అంత కన్నా ఎక్కువ మోసాలు కూడా ఉంటాయి.చాలామంది ఆన్‌లైన్ వేదికగా చేసుకుని పలువురు వారికి కావాల్సిన వస్తువులను కొనుగొలు చేస్తుంటారు.అయితే అప్పుడప్పుడు వారు బుక్ చేసుకున్న వస్తువులు బదులు మరోకటి రావడం మనం చూస్తునే ఉంటాం.వందల్లో వేలల్లో ఒక్కరికి అలా జరుగుతుంది. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఓ హీరో.తమిళ హీరో నకుల్ తనకు ఎదురైన చేదు అనుభవంను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో సదరు ఆన్ లైన్ షాపింగ్ సంస్థ దిగి వచ్చి హీరో నకుల్ కు న్యాయం చేసేందుకు సిద్దం అయ్యింది.
నకుల్ తన పెళ్లి రోజు సందర్భంగా భార్యకు ఐఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వాలని భావించాడు.నకుల్ తనకు ఎదురైన చేదు అనుభవంను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో సదరు ఆన్ లైన్ షాపింగ్ సంస్థ దిగి వచ్చి హీరో నకుల్ కు న్యాయం చేసేందుకు సిద్దం అయ్యింది.దీంతో నకుల్ చేసిన పోస్ట్‌కు ఫ్లిప్‌కార్ట్ సంస్థ దిగొచ్చింది.మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ ఆర్డర్ వివరాలను ఒక్కసారి పంపించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. నకుల్ ఆర్డర్ చేసిన ఐఫోన్ త్వరలోనే అందిస్తామని ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రకటించింది.
