కేసీఆర్ స‌భ‌కు రేవంత్ రెడ్డి భార్య,కూతురు

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ గురించి అందరికి తెలిసిందే..కేసీఆర్ స‌భ ఉండ‌టంతో ముంద‌స్తు చర్యగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది.కేసీఆర్ సభను అడ్డుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు బద్దలుగొట్టి మరీ పోలీసులు లోపలికి వచ్చారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. బొమ్రాస్‌పేట‌లో నేటి సాయంత్రం వరకు 144 సెక్షన్‌ను విధించిన పోలీసులు ఈసీ ఆదేశాలతో రేవంత్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై ఆయ‌న భార్య స్పందించారు.రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే స‌మ‌యంలో ఆయన భార్య గీత అక్కడే ఉన్నారు.మరోవైపు తన భర్తను అర్థరాత్రి ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారని రేవంత్ రెడ్డి భార్య గీత ఆరోపించారు.

కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదని వాపోయారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.తన భర్త అరెస్ట్ పై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి బయలుదేరిన వేళ, హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు అమెను అడ్డుకుని, ఈ సమయంలో బయటకు వెళితే, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చని ఆపారు. 144వ సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో కేసీఆర్ సభను ఎలా నిర్వహిస్తారని గీతా పోలీసుల‌ని ప్రశ్నించారు.కేసీఆర్ స‌భ‌కు న్ని రకాల అనుమతులూ ఉన్నాయని పోలీసులు చెప్ప‌డంతో ,తాను కూడా కేసీఆర్ సభకు వెళతానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -