Friday, April 26, 2024
- Advertisement -

నాని ఇమేజ్ త‌గ్గిందా లేక నాగ‌ర్జున మార్కెట్ పెరిగిందా..?

- Advertisement -

కింగ్ నాగర్జున‌,న్యాచుర‌ల్ స్టార్ నాని ఇద్ద‌రి క‌లిసి న‌టించిన సినిమా దేవ‌దాస్.ఈ కాంబినేష‌న్ అనుకున్న‌ప్ప‌టి ద‌గ్గ‌ర నుంచే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.పైగా శ్రీరామ్ ఆదిత్య వంటి యంగ్ ద‌ర్శ‌కుడితో ఈ స్టార్ హీరోలిద్ద‌రు న‌టిస్తుండ‌టంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది.దీనికి త‌గిన‌ట్లుగానే సినిమా ట్రైల‌ర్,టీజ‌ర్ ఆక‌ట్టుకున్నాయి.దేవ‌దాస్ సినిమా గురువారం విడుద‌లైంది.సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్లు కుమ్మేస్తుంద‌ని అనుకున్నారు.దేవ‌దాస్ క‌లెక్ష‌న్లు బాగానే ఉన్నాయి.
అయితే సినిమా విడుద‌ల రోజు మాత్రం మంచి ఒపినింగ్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది.

నాని,నాగ్ క‌లిసి న‌టిస్తుండ‌టంతో అంద‌రు సినిమా చూస్తార‌ని భావించారు.తీరా చూస్తే నాని గ‌త సినిమాల ఒపినింగ్ కంటే దేవ‌దాస్ సినిమా చాల త‌క్కువ క‌లెక్ట్ చేసింది.నాని ఎమ్‌సీఏ సినిమా రిలీజ్ రోజున‌ 15 కోట్లుకు పైగా రాబ‌డితే,దేవ‌దాస్ సినిమా కేవ‌లం 12 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్ట‌గ‌ల్గింది.అదే స‌మ‌యంలో నాగ‌ర్జున కెరీర్‌లో ఇదే అత్య‌ధిక ఒపినింగ్స్ కావ‌డం విశేషం.అస‌లు ఈ సినిమా క‌లెక్ష‌న్ల విష‌యంలో నాని ఇమేజ్ త‌గ్గిందో లేక నాగ‌ర్జున మార్కెట్ పెరిగిందో తెలియ‌డం లేదు.మొత్త‌నికి సినిమా హిట్ కావ‌డంతో సినిమా యూనిట్ సంతోషంతో ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -