క‌ల్యాణ్ రామ్‌పై పోటీకి రెడీ అవుతున్న బండ్ల గ‌ణేష్‌?

- Advertisement -

తెలంగాణ‌లో ఎన్నిక‌ల హడావిడి మొద‌లైంది.తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డంతో ,ఇక్క‌డ ఎన్నిక‌ల అనివార్యం అయ్యాయి.టీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా మిగిలిన పార్టీలు అన్ని ఏకతాటిపైకి వ‌చ్చి మ‌హ‌కూట‌మిని ఏర్పాటు చేసే ప‌నిలో ప‌డ్డాయి.దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ,ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్దం అవుతుంది.ఎన్నిక‌లు అంటే సినీ గ్లామ‌ర్ కూడా త‌ప్ప‌ని స‌రిగా ఉంటుంది.ఈ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ముగ్గురు సెలబ్రిటీల మధ్య వార్ జరగబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత తెలంగాణాలో తెలుగుదేశం హవా పూర్తిగా తగ్గిపోయింది.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్ట‌కుంటున్న తెలుగు దేశం పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌ను ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నిల‌బెట్టాడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే ఇదే స్థానం నుంచి ఇటీవ‌లే కాంగ్రెస్‌లో చేరిన నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా పోటీ చేయ‌ల‌ని భావిస్తున్నార‌ట‌.పొత్తులో భాగంగానే వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఈ స్థానం నుంచి పోటీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.మ‌రి వీరి పై పోటీకి బీజేపీ పార్టీ కూడా సినీ గ్లామ‌ర్ ఉన్నవారినే ఉప‌యోగించుకుంటుంద‌ట‌.ఈ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడానికి జీవితా రాజశేఖర్ సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం.జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఇంత మంది సినీ ప్ర‌ముకులు ఆస‌క్తి చూపించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -