Sunday, May 5, 2024
- Advertisement -

మేం తాగేది వ‌న్ బై టూ

- Advertisement -
  • ఎంసీఏ టైటిల్ సాంగ్ విడుద‌ల‌

మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాన్ని తెలుపుతూ ఎంసీఏ సినిమా టైటిల్ సాంగ్ ఉంది. ఈ పాట‌ను సోమ‌వారం టైటిల్ సాంగ్ పేరిట ఆదిత్య మ్యూజిక్ విడుద‌ల చేసింది. ఈ పాట‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎమ్‌.సి.ఎ’. మిడిల్‌క్లాస్‌ అబ్బాయ్‌… అనేది ట్యాగ్‌. ఫిదా సినిమాతో ఆక‌ట్టుకున్న సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. రాజు, శిరీశ్‌, లక్ష్మణ్‌ నిర్మాతలుగా వ్య‌వ‌హరిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘వీధి చివర ఉంటాదో టీ కొట్టు… ఆడ మేం తాగేదేమో వన్‌ బై టు… మేమే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలం’ అంటూ పాట సాగుతోంది. ఆ పాట‌ను చంద్రబోస్ ఈ పాట‌ను బాగా రాశారు. మధ్య తరగతి కుర్రాళ్ల జీవితాల్ని, వాళ్ల నడవడికని ప్రతిబింబిస్తూ ఈ పాట‌ను రాశారు. ఈ పాట‌కు దేవిశ్రీప్రసాద్‌ హుషారైన బాణీని అందించారు. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. ఈ సినిమా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్పిస్తోంది.

ఈ సినిమా ప్ర‌క‌టించిన నాటి నుంచి అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. వ‌రుస విజ‌యాల‌తో ఉన్న నాని, ఫిదా సినిమాలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మ‌ది దోచిన సాయిప‌ల్ల‌వి జోడి వ‌స్తుండ‌డంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా పేరు పొందిన దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -