Sunday, May 5, 2024
- Advertisement -

సంక్రాంతి కానుకలు ఇచ్చిన నాని

- Advertisement -

మూడు రోజుల పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, క‌నుమ ఈ మూడు పండుగ‌ల‌కు మ‌న స‌హ‌జ న‌టుడు నాని మూడు కానుక‌లు ఇచ్చాడు. త‌న అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు ఫ‌స్ట్‌లుక్‌లు ఇచ్చి నిజంగా పండుగ చేసుకునేలా చేశాడు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’ రెండు ఫస్ట్‌లుక్‌లు, ఓ పాట‌ను పండుగ సంద‌ర్భంగా న్యాచురల్ స్టార్ నాని విడుద‌ల చేశాడు. ఈ సినిమాలో నాని కృష్ణ‌, అర్జున్ రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నాడు.

భోగి పండుగ సందర్భంగా ఆదివారం (జ‌న‌వ‌రి 14) ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నాని ట్విట్టర్‌లో విడుద‌ల చేశాడు. ఫస్ట్‌లుక్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా నాని ఆకట్టుకున్నాడు నాని.
సంక్రాంతి రోజు సోమ‌వారం (జ‌న‌వ‌రి 14) ‘కృష్ణార్జున యుద్ధం’లోని అర్జున్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ పాత్ర‌లో నాని హుషారుగా కనిపించాడు.

ఈ రెండు కానుక‌ల‌తో పాటు క‌నుమ రోజు మంగ‌ళ‌వారం (జ‌న‌వ‌రి 14) మూడో కానుక‌గా ఈసారి పాట‌నే విడుద‌ల చేశారు. సినిమాలోని తొలి లిరిక‌ల్ పాట‌ను విడుదల చేశారు. ‘దారి చూడు.. దమ్మూ చూడు మామ.. దున్నపోతుల బేరెచూడు’ అంటూ నాని ఊర మాస్‌లో ఉన్న ఫొటోల‌తో పాట ఉంది. పెంచ‌ల్ దాస్ ఈ పాట‌కు లిరిక్స్ అందించాడు. అంతేకదు ఆయన్నే ఈ పాట‌ పాడాడు.

నాని స‌ర‌స‌న అనుపమ పరమేశ్వరన్‌, రుక్సర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేస‌విలో సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -