శృంగారంలోని దైవత్వాన్ని రామ్ గోపాల్ వర్మ బయటపెడతానని చెబుతున్నాడు. ఏకంగా పచ్చిగా శృంగార సినిమాల్లో నటించే పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో కలిసి పచ్చి నిజాలు చెప్పిస్తున్నానంటున్నాడు వర్మ. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పేరుతో ఓ సినిమా లాంటి డాక్యుమెంటరీని తీస్తున్నారు. దీని ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు.
ఒక అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చు అనే విషయాన్ని తాను చూపిస్తానని ప్రకటించాడు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమా కాదు షార్ట్ ఫిల్మ్ కాదు వెబ్ సిరీస్ కూడా కాదు. సెక్స్ మీద పోర్న్ స్టార్ మియా మాల్కోవా అభిప్రాయం అని వర్మ చెబుతున్నారు. మాల్కోవా నగ్నత్వంలోని అణువణువునీ ఒక పెయింటింగ్‌లా తీర్చిదిద్దానని వర్మ చెప్పేసుకున్నాడు. ఏకంగా మాల్కోవా ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ కన్నా గొప్పదని ఫిక్సయిపోయాడు. అలెగ్జాండర్ కత్తితో కష్టపడి యుద్ధం చేశాడు. మరి మాల్కోవా ఏం చేసిందయ్యా అంటే… అందం అనే ఆయుధంతో యుద్ధం ప్రకటించి మానవ సమాజంపై దండెత్తిందట. తన అందమైన ముఖం.. అమాయకత్వంతో మాల్కోవా ప్రతి వారిని సమ్మోహనంగా వశపరుచుకుంటుందనేది వర్మ నమ్మకం. మియా మాటలు వింటే సెక్స్ లోని అన్ని అంశాలు పవిత్రంగా.. స్వచ్ఛంగా కనిపిస్తాయట. అదేమిటే పోర్న్ స్టార్ పవిత్రత గురించి మాట్లాడటం ఏమిటని ఉలిక్కిపడొచ్చు. అక్కడింకో కండిషన్ ఉంది. కళ్ళు మెదడున్న వారికి మాత్రమే అలా కనపడతాయి.
ఇవన్నీ చదివాక కొత్త సందేహాలు పుట్టుకొస్తే అది ఎవరి తప్పు కాదు. ఎందుకంటే తీసిన వర్మకు తప్ప అందులో ఏముందో తెలియదు. అదేదో అద్భుతం గుట్టు విప్పినంత అబ్బురంగా ఫీలయి ఆయన రాసింది చదువుకుని అబ్బో అనుకోవాల్సిందే. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
