Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబుకు బిగ్గెస్ట్ షాక్….. 2014 ఎన్నికల పెట్టుబడిదారుడు మోడీ పార్టీలోకి జంప్?

- Advertisement -

కొన్ని నెలల తర్వాత బ్రతిమాలి, బామాలి మరీ కేవలం కలవడానికి అపాయింట్‌మెంట్ సాధించుకోగలిగిన చంద్రబాబు అండ్ టీంకి …….కలిసిన నాలుగు రోజుల్లోనే నరేంద్రమోడీ నుంచి బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ వచ్చింది. మోడీని కలిసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా బిజెపి-టిడిపి పొత్తు చెడకుండా కాపాడుకోవడం, తన కేసుల విషయంలో చూసీ చూడనట్టు పోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్‌కి అనుకూలంగా మోడీ టర్న్ తీసుకోకుండా ఉండడం లాంటి విషయాలకే అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నది రాజకీయ మేధావులు చెప్తున్న నిజం. అంతర్గత చర్చల్లో టిడిపి నేతలు కూడా ఒప్పుకుంటున్న నిజం. అయితే చంద్రబాబుకు మోడీ ఏం హామీ ఇచ్చారో తెలియదు కానీ తనతో కలిసిన నాలుగు రోజుల వ్యవధిలోనే బాబుకు బిగ్గెస్ట్ షాక్ అవ్వడానికి రెడీ అయ్యాడు మోడీ.

2014 ఎన్నికలకు ముందు నుంచీ కూడా చంద్రబాబుకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న సుజనా చౌదరి……ఎన్నికల సమయంలో అయితే వైకాపా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కోట్లు టిడిపి అభ్యర్థులు ఖర్చుపెట్టడానికి, ఆ రకంగా విజయం సాధించడానికి ప్రధాన కారణమయ్యాడన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నిజం. అందుకే చంద్రబాబు కూడా సుజనా చౌదరిని రాజ్యసభ సభ్యుడిని చేయడంతో పాటు కేంద్ర కేబినెట్ మంత్రిని కూడా చేశాడు. అదే ఇప్పుడు బాబు కొంప ముంచేలా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి అయిన మరుక్షణం నుంచీ కూడా బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేశాడు సుజనా చౌదరి. అంతా కూడా తనకే లాభిస్తుందన్న ఉద్ధ్యేేశ్యంతో చంద్రబాబు కూడా చూసీ చూడనట్టుగా పోయాడు. అయితే ఇప్పుడు ఆ సుజనా చౌదరి బాబుకు షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. 2019 ఎన్నికల సమయం నాటికి బిజెపిలోకి జంప్ చేయడానికి చూస్తున్నాడు.

దేశవ్యాప్తంగానూ…..వివిధ దేశాల్లోనూ వ్యాపారాలు ఉన్న సుజనా చౌదరి టిడిపి లాంటి ప్రాంతీయ పార్టీల్లో ఉండడం కంటే కూడా బిజెపిలాంటి జాతీయ పార్టీలో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. బిజెపిలో చేరడానికి సంబంధించి చివరి దశ చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. సుజనా చౌదరి జంపింగ్ కన్ఫాం అయితే మాత్రం ప్రజాబలం పరంగా చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ ఆర్థికంగా మాత్రం భారీగా నష్టం వాటిల్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా జగన్ పార్టీ కంటే రెండు రెట్లు ఎక్కువగా టిడిపి ఖర్చు చేసిందన్నది విశ్లేషకుల మాట. అలాంటి నేపథ్యంలో టిడిపికి బలమైన స్పాన్సరర్‌గా ఉన్నాడని ఇన్నాళ్ళూ టిడిపి జనాలే చెప్పుకుంటున్న సుజనా చౌదరి జంప్ అయితే అది పార్టీకి కచ్చితంగా పెద్ద దెబ్బే అవుతుంది. అన్నింటికీ మించి సుజనా చౌదరి జంపింగ్‌ని మోడీ ప్రోత్సహించాక కూడా చంద్రబాబు నాయుడు మోడీతోనే పొత్తు పెట్టుకుంటానంటే మాత్రం ……. కేసుల భయంతో చంద్రబాబు మోడీ దగ్గర బానిసలా ఉంటున్నాడన్న కామెంట్స్ చేస్తున్న సిపిఐ నారాయణ లాంటి నాయకులతో పాటు రాజకీయ మేధావులు కూడా చంద్రబాబుని మరీ పూచిక పుల్లలా తీసేయడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చంద్రబాబు మోడీ దగ్గర సాగిలపడుతున్న విషయం గుర్తిస్తే మాత్రం 2019లో బాబుకు షాక్ తప్పకపోవచ్చన్నది ఎనలిస్ట్‌ల అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -