Saturday, May 4, 2024
- Advertisement -

శైలజారెడ్డి ప్రారంభం

- Advertisement -
  • నాగ‌చైత‌న్య‌, అను జోడిగా

సినిమాలపై వ‌రుస‌గా కొత్త పెళ్లి కొడుకు సంత‌కాలు చేస్తూ పోతున్నాడు. ఇప్ప‌టికే రెండు సినిమాలు సెట్స్‌పై ఉండ‌గా ఇప్పుడు మ‌రో సినిమాకు ప‌చ్చ‌జెండా ఊపాడు. ఆ సినిమా ప్రారంభోత్స‌వం శ‌నివారం (న‌వంబ‌ర్ 25వ తేదీ) చేశారు. విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీస్తున్న మారుతీ తీస్తున్న సినిమాలో న‌టిస్తున్నాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్‌ను దాదాపుగా ఖ‌రారు చేశారు. ఇక సినిమాలో కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ నటిస్తార‌ని తెలుస్తోంది. అయితే అత్త పాత్ర‌కు సీనియ‌ర్ న‌టి శ్రీదేవిని కూడా అడిగార‌ని టాక్‌.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలాఖరున ప్రారంభించేలా ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. దిల్‌రాజ్ హీరోహీరోయిన్ల‌పై క్లాప్ ఇచ్చారు.సినిమా త‌ర్వాత సినిమాలు పూర్తి చేయ‌డంలో చైతు దృష్టి సారిస్తున్నాడు. ఆ విధంగా చ‌క‌చ‌కా సినిమాల షూటింగ్‌ల‌లో పాల్గొంటూ బిజీబిజీగా గ‌డుపుతున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -