Wednesday, May 8, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కౌంట‌ర్ ఇచ్చిన హీరో నిఖిల్‌

- Advertisement -

పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి,గీతా గోవిందం ఇలా వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు నోటా సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.నోటా సినిమా త‌మిళ‌,తెలుగు బాష‌ల‌లో విడుద‌ల అయింది.అయితే రెండు బాష‌ల‌లో కూడా సినిమా ఫెయిల్ అయింది.నోటా ఫెయిల్యూర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ సోషల్ మీడియా వేధిక‌గా స్పందించాడు.నేనే ఫెయిల్యూర్‌ని ప్రేమిస్తున్న వారిని పండగ చేసుకోమని మరోసారి ఇలాంటి ఛాన్స్ రాదంటూ తనదైన స్టైల్ లో రాసుకొచ్చాడు.అయితే విజ‌య్ దేవ‌ర‌కొండపై ప‌రోక్షంగా కామెంట్స్ చేశాడు యంగ్ హీరో నిఖిల్‌.

”ఎవరైతే ఈ ప్రపంచం తమ చుట్టూ తిరుగుతుందని అనుకుంటూ అనవసరమైన యాటిట్యూడ్ ని ప్రదర్శిస్తూ ఉంటారో.. డూడ్ నువ్ మరీ అంత ముఖ్యం కాదు.. ప్రతీ నటుడు తనతో తనే పోటీ పడాలి.మనమంతా సినిమా నిర్మాణం అనే సముద్రంలో నీటి బిండువులం మాత్రమే.. హైప్ లెస్.. వర్క్ మోర్” అంటూ ట్వీట్ చేశాడు. అంతే విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ నిఖిల్‌ను ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన నిఖిల్ సోషల్ మీడియా నుండి తను పెట్టిన పోస్ట్ ని తొలగించారు. కాని అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.స్క్రీన్ షాట్ల రూపంలో నిఖిల్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -