తెలంగాణ రాష్ట్రంలో రాబోవు ఎన్నికలలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఎన్డీటీవీ ఓపినియన్ సర్వే తేల్చేసింది.డిసెంబర్ 7వ తేదీన జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ 85 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోనుందని ఈ సర్వే వెల్లడించింది.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోని 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కనీస మెజారిటీ 60 అసెంబ్లీ స్థానాలు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌కు 63 స్థానాలు దక్కాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌కు మంచి ఫలితమే దక్కనుందని ఈ సర్వే తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహకూటమి ఘోర ఒటమి తప్పదని ఎన్డీటీవీ సర్వే వెల్లడించింది.కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 21 సీట్లను కైవసం చేసుకొంది. అయితే ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 స్థానాలు మాత్రమే దక్కనున్నట్టు ఈ సర్వే రిపోర్ట్ తెలుపుతోంది.ఎంఐఎంకు 7 స్థానాలు, బీజేపీకి 5 స్థానాలు దక్కనున్నాయని ఈ రిపోర్ట్ చెబుతోంది. ఇతరులకు 4 స్థానాలు దక్కనున్నట్టు వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన మేర సీట్లు దక్కకపోవచ్చని ఈ సర్వే రిపోర్ట్ తేల్చి చెబుతోంది.
