Tuesday, May 14, 2024
- Advertisement -

కృష్ణాజిల్లాలో దారుణం..నాలుగేళ్ల కూతిరిపై క‌న్న తండ్రే…

- Advertisement -

కృష్ణా జిల్లాలో మ‌రో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. కన్నతండ్రే కామాంధుడిలా మారాడు. కన్నప్రేమను మరిచాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన తన ఐదేళ్ల బిడ్డపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. నాన్న అన్న పదానికి మాయని మచ్చ తెచ్చాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటు చేసుకుంది

అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన కోటినాగేశ్వరరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన నాగేశ్వర్రావు తన నాలుగేళ్ల చిన్నారిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. చాక్లెట్ కొనిస్తానని పాపను తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. దీంతో చిన్నారి నొప్పిగా ఉందని తల్లికి చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే.. భర్త వక్రబుద్ధి గమనించింన భార్య.. పిల్లలను తీసుకొని అతనికి దూరంగా ఉంటుంది. రెండు రోజుల క్రితం పిల్లలపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ.. భార్య వద్దకు వచ్చిన కోటి నాగేశ్వరరావు.. నాలుగేళ్ల కూతురిని లైంగికంగా వేధించాడు.

కూతురనే కనికరం లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన భార్య.. వెంటనే కూతురిని భర్త నుంచి రక్షించుకోగలిగింది. వెంటనే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగేశ్వర్రావు చేసిన నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -