Thursday, May 16, 2024
- Advertisement -

హీరో నిఖిల్ కాలేజ్ స్టూడెంట్స్‌ను కొట్టాడా?

- Advertisement -

తెలుగు యంగ్ హీరోల‌లో నిఖిల్‌కు ఉన్న స‌క్సెస్ రేట్ మ‌రో హీరోకి లేదు అంటే అతిశేయోక్తి కాదు.విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటు వ‌ర‌స విజ‌యాల‌ను సాధిస్తు త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్‌.ప్రస్తుతం అతడు ‘ముద్ర’ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా కూడా ఓ విభిన్న కథాంశంతో తెర‌కెక్కుతుంది.ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు మంచి రెస్ప‌న్స్ వ‌చ్చింది.అయితే కొన్ని రోజులుగా నిఖిల్ పై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ పై అతడు చేశాడని, వారిని కొట్టాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు నిఖిల్. ”కాలేజ్ లో నా తమ్ముడి విషయంలో నేను ఇన్వాల్వ్ అయిన మాట నిజమే.

కానీ నేను స్టూడెంట్స్ ని కొట్టానని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. నా తమ్ముడు చదువుకుంటున్న కాలేజ్ లో 16 మంది కలిసి నా తమ్ముడిని ర్యాగింగ్ చేస్తున్నారు.ప్రతిరోజు వాడిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం నాకు తెలిసి నేను వారిపై పోలీసులకు కంప్లైంట్ చేశాను. వారిపై పోలీసులే చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ వారిపై ఒక్క దెబ్బ కూడా పడలేదు. కాని సోష‌ల్ మీడియాలో మాత్రం కాలేజ్ స్టూడెంట్స్‌ని కొట్టాన‌ని వార్త‌లు రాస్తున్నార‌ని,వాటిల్లో నిజం లేద‌ని చెప్పుకొచ్చాడు.ఈ వ్య‌వ‌హారంలో నన్ను రౌడీగా చిత్రిక‌రిస్తున్నార‌ని తెలిపాడు నిఖిల్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -