Saturday, May 18, 2024
- Advertisement -

అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న‌లో టీఆర్ఎస్‌ దూకుడు…న‌త్త న‌డ‌క‌లో కాంగ్రెస్, ఇత‌ర పార్టీలు

- Advertisement -

తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ క‌దం తొక్కుతోంది. ఇప్ప‌టికే గులాబీ బాస్ కేసీఆర్ ఆదిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. 6 వ‌తేదీన మ‌రో సారి క్యాబినేట్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి అసెంబ్లీనీ ర‌ద్దు చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఒక వైపు ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌ర‌గుతుంటే అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించడంలో గులాబీ పార్టీ ముందుంది.

రెండు అసెంబ్లీ స్థానాల‌కు మంత్రి కేటీఆర్‌, ఎంపీ క‌విత అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించేది సీఎం కేసీఆర్ లేదా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ప్ర‌క‌టిస్తారు. కానీ ఇక్క‌డ మాత్రం ఇందుకు భిన్నంగా కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ఒక అభ్యర్థిని ప్రకటిస్తే.. మరో నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ కమ్ కేసీఆర్ కుమార్తె కవిత మరొకరిని అనౌన్స్ చేశారు.

కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ పేరును కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రకటించారు. వచ్చేఎన్నికల్లో ఆయనదే విజయమని కేటీఆర్ నమ్మకంగా చెప్పారు. ఇదిలా ఉంటే.. ఎంపీ కవిత జగిత్యాల నియోజకవర్గ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సంజయ్ కుమార్ పేరును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనదే విజయమని తేల్చారు. ఇదిలా ఉంటే ఈనెల 7న మరో పదిమేను మందితో కలిసి తొలిజాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేస్తారని తెలుస్తోంది.

పార్టీ త‌రుపున అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించి గులాబీ పార్టీ దూసుకెల్తోంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ , ఇత‌ర పార్టీలు వెనుకంజ‌లో ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం మాదేన‌ని కాంగ్రెస్ చెబుతున్నా ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు అయితే క‌నిపించ‌డంలేదు.

ఇదిలా ఉంటే తెలంగాణాలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోవ‌డానికి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ‌డ‌నానికి కాంగ్రెస్ సిద్ధ‌మ‌వుతోంది. కాంగ్రెస్‌, టీడీపీ, వామ‌ప‌క్షాలు,అన్నీ క‌ల‌సి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. ఇప్ప‌టికే వారి మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

అభ్య‌ర్త‌ల విష‌యంలో మాత్రం అన్ని పార్టీలు పార్టీ త‌రుపున అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌డంలో వెనుకంజ‌లో ఉన్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా సిద్ధ‌మ‌ని బీరాలు ప‌ల‌క‌డం త‌ప్ప ఆదిశ‌గా అయితే ప్ర‌య‌త్నాలు చేయ‌డంలేదు. ఇంకా అభ్య‌ర్తుల ఎంపిక విష‌యంలో నానాతంటాలు ప‌డుతోంది. టీఆర్ఎస్ అభ్య‌ర్తుల‌ను ఢీకొట్టే నాయ‌కుల కోసం వెతుకులాట ప్రారంభంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ త‌రుపున ప‌లానా అభ్య‌ర్తి అని చెప్ప‌క‌పోవ‌డం చూస్తే ఆ పార్టీ ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక టీడీపీ పార్టీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే తెలంగాణాలో మ‌ర‌న‌శ‌య్య‌పై ఉంది ఆపార్టీ. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నుమ‌రుగు కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌ట్ట‌డం త‌ప్ప మ‌రో మార్గంలేదు. మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో ఆయ‌న స్టాట‌జీ ఏంటో మ‌రి కొద్దిరోజుల్లో బ‌య‌ట‌ప‌డ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -