Thursday, May 16, 2024
- Advertisement -

బాలీవుడ్ కలల్లో హ్యాపీడేస్ నిఖిల్..!

- Advertisement -

హ్యాపీడేస్ సినిమాతో ఆరంగ్రేటం చేసి.. మంచి గుర్తింపును సొంతం చేసుకొన్నాకా చేసిన సినిమాలతో నిఖిల్ కు పెద్ద ప్రయోజనం దక్కలేదు.

ఇతడి కథ అయిపోయిందనుకొంటున్న తరుణంలో వచ్చింది “స్వామిరారా” సినిమా. అక్కడి నుంచి ఇతడి దశ తిరిగింది. ఆ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ కావడం.. ఆ తర్వాత చేసిన కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య సినిమాల కూడా అదే స్థాయిలో అడటంతో నిఖిల్ దశ తిరిగింది. వరసగా ప్రయోగాత్మక.. హిట్ సినిమాల్లో నటించడంతో ఈ హీరోకి ప్లస్ అయ్యింది. ఇప్పుడు నిఖిల్ సినిమాలకు తెలుగులో మంచి ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి వచ్చేసింది.

మరి ఇదే ఊపులో ఈ హీరో ఏకంగా బాలీవుడ్ మీద కన్నేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే పనిలో ఉన్నాడట నిఖిల్. ముంబై వెళ్లి ఆ విషయాలను సమీక్షించుకొంటున్నాడట. తన సినిమాలను హిందీలోకి డబ్ చేయడం లేదా.. స్ట్రైట్ గా ఏదైనా బాలీవుడ్ సినిమాలో చేయడం గురించి ఆలోచిస్తున్నాడట నిఖిల్. త్వరలోనే నిఖిల్ సినిమా “శంకరాభరణం” విడుదల కాబోతోంది. మరి ఈ సినిమానే హిందీలోకి డబ్ చేస్తారా? లేక ఈ హీరో ఆ తర్వాత చేయబోయే సినిమాను బాలీవుడ్ లో చేస్తాడా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరి పెద్దగా నేపథ్యమేమీ లేకపోయినా.. సినిమాల్లోకి వచ్చి.. ఈ కుర్ర హీరో ఈ విధంగా దూసుకెళ్లడం ఆసక్తికరమైన అంశమే. తెలుగులో నిలదొక్కుక్కొన్నాకా ఏకంగా బాలీవుడ్ లో ట్రయల్స్ గురించి డ్రీమ్స్ లో ఉన్నాడు. మరి ఇతడి డ్రీమ్స్ నిజం కావాలని.. ఒక తెలుగువాడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని ఆశిద్దాం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -