ఇంటిలో లేదా ఆఫీస్ లో ఎక్కువ సేపు కదలకుండా ఒకే చోట కూర్చుంటే ఊబకాయం, గుండె సంబందిత సమస్యలు వస్తాయనే విషయం అందరికి తెలిసిందే.
అయితే ఇలా గంటల తరబడి కదలకుండా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవల పరిశోదనల్లో తెలిసింది.
ఎక్కువ సేపు కూర్చోవటం అనేది పొగ త్రాగటంతో సమానమని నిపుణులు అంటున్నారు. పొగ త్రాగటం వలన శ్వాస కోశ వ్యాదులు వస్తాయి కానీ ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం వలన సుమారు 34 రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఎక్కువ సేపు కూర్చోవటం వలన ఏ రకమైన క్యాన్సర్ వస్తుందో అనే దాని మీద విస్తృతంగా పరిశోదనలు జరుపుతున్నారు. రోజుకి ఏకబిగిన 14 గంటల పాటు కూర్చొనే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. అందువల్ల గంటకు ఒకసారి అలా పది నిముషాలు నడిస్తే మంచిదని, అలా నడవటం వలన చాలా రకాల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.
