Saturday, May 18, 2024
- Advertisement -

ఆ హీరోనే వాడుకుంటూనే హిట్లా.. లేక‌పోతే ఫ‌ట్టా

- Advertisement -

సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి దాదాపు 16 ఏళ్లు దాటింది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త స‌మ‌యంలో సూప‌ర్‌హిట్ సినిమాల్లో న‌టించాడు. ఆ త‌ర్వాత మ‌రికొన్ని హిట్ సినిమాలు చేసి ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఏడు, ఎనిమిదేళ్ల పాటు ప‌రాజ‌యాలు పొందాడు. ఆ త‌ర్వాత ఒక‌రి పేరు వాడ‌డ‌డం మొద‌లుపెట్టాడు. అప్ప‌టి నుంచి హిట్లు పొందుతున్నాడు. ఆ న‌టుడెవ‌రో మీకు తెలిసే ఉంటాడు.

ప్ర‌స్తుతం ఆ హీరో ఓ సినిమా చేస్తున్నాడు. తాను అభిమానించే హీరోనే ఈసారి నిర్మాత‌గా చేసుకొని సినిమా తీశాడు. మొన్న‌నే ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఆ కార్య‌క్ర‌మానికి ఈ యువ హీరోకు తోడుగా ఆ పెద్ద హీరో కూడా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా యువ హీరో మాట్లాడిన తీరు చూస్తుంటే ఆ హీరోను బాగా వాడుకుంటున్నాడు అని అంద‌రికీ తెలుస్తోంది. అత‌డి పేరు వాడ‌డం మొద‌లెట్టినప్ప‌టి నుంచి సినిమాకు హిట్లు ఈ యువ హీరో పొందుతున్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత సినిమా హిట్ ఆ పెద్ద హీరో అభిమానం వాళ్ల ఆడింది అని ఈ హీరో చెబుతున్నాడు. ప్ర‌తిసారి ఆ హీరోను న‌మ్ముకోవ‌డం అతిగా అనిపిస్తోంది.

నీకంటూ సొంత ప్ర‌తిభ ఉంది.. సొంత బ్యాన‌ర్ ఉంది.. కుటుంబ‌స‌భ్యుల్లో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారు ఉన్నారు. ఒక్క క‌థ‌ల విష‌యంలో మంచివాటిని ఎంపిక చేసుకొని న‌టిస్తే నీ కెరీర్‌కు నీవే బాసూ. ఎంత అభిమానం ఉన్నా ఈ విధంగా ఆ హీరోను వాడేసుకోవ‌డం స‌రికాదు అని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ విష‌య‌మై ఆ పెద్ద హీరో కూడా కొంచెం ఇబ్బందికి గుర‌య్యార‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడేప్పుడు.. కూర్చున‌ప్పుడు క‌నిపించింది. పైగా ఇప్పుడు ఆ హీరో రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నప్పుడు ఇలా పిలిచి ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని ఆయ‌న అభిమానులు కోరుతున్నారు. ఒక‌వేళ ఆయ‌న వార‌స‌త్వాన్ని నువ్వు కొన‌సాగిస్తావా అని ప్ర‌శ్నిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -