- Advertisement -

భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై ఎంపీల‌తో జ‌గ‌న్ భేటీ..

- Advertisement -

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ప్రజాసంకల్పయాత్రలో తాను విడిది చేసిన శిబిరం వద్ద ఎంపీలతో చర్చిస్తున్నారు. ప్ర‌త్యేక‌హోదాపై ఎలా ముందుకెల్లాల‌నే విష‌యంపై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో ఎటువంటి అవాంతరాలు ఎదురైనా, పోరాటాన్ని కొనసాగించాలని వైఎస్ జగన్ స‌మావేశంలో తన పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఎంపీలతో సమావేశమైన ఆయన పార్లమెంట్ లో తదుపరి పాటించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేంత వరకూ వదిలి పెట్టవద్దని జగన్ స్పష్టంగా తన ఎంపీలకు వెల్లడించారు. నిత్యమూ నిరసనలు తెలపాలని సూచించారు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ రెండు నాలుకల ధోరణిని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి కూడా సీక్రెట్ గా వెళ్లి కేంద్ర మంత్రిని కలిసిన సుజనా చౌదరి వ్యవహారాన్ని గుర్తు చేసిన జగన్, చంద్రబాబు ఇప్పటికీ బీజేపీతో కలిసే ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరింత ఉధృతం చేయడం, హోదాకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలకు సలహాలు, సూచనలివ్వనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -