Saturday, May 18, 2024
- Advertisement -

నితిన్… నీ పెళ్లి ఎప్పుడని అడిగేసింది

- Advertisement -

యంగ్ లవర్ బాయ్ నితిన్ గురించి ఈమధ్య సోషల్ మీడియాలో ఓ ఎఫైర్ న్యూస్ గట్టిగానే ప్రచారం అవుతుంది. ఓ హీరోయిన్ తో అబ్బాయిగారు గాఢమైన ప్రేమలో ఉన్నాడని దాని సారాంశం. ఈ న్యూస్ ను బేస్ చేసుకుని ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ తన ట్విట్టర్ అకౌంట్లో నితిన్ ను ఓ ప్రశ్న వేసింది. నీ కళ్యాణం ఎప్పుడని చాలామంది అడుగుతున్నారంటూ ఆమె ప్రశ్న వేసింది. దీనికి నితిన్ నుండి ఎలాంటి రిప్లై రాలేదు కానీ, అభిమానుల్లో చర్చ మాత్రం గట్టిగానే నడుస్తోంది.

నితిన్ 14 ఏళ్లు ముందు దిల్‌రాజు బ్యానర్‌లో ‘దిల్’ అనే మూవీ చేశాడు . ఇప్పుడు అదే బ్యానర్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే ప్రాజెక్ట్ చేయనున్నాడు. ‘శతమానం భవతి’ ఫేం సతీష్ వేగేశ్న దీనికి డైరెక్టర్. మార్చి నుండి షూటింగ్ జరగనున్న ఈ ఫిల్మ్‌కి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.కాని ఎక్కడా కోన నీరజ చేసిన ట్వీట్ కు మాత్రం రిప్లై ఇవ్వలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -