Sunday, May 5, 2024
- Advertisement -

బండ్ల గణేష్ ఓపెన్ అయిపోయాడు

- Advertisement -

వక్కంతం వంశీ వేసిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ అరెస్ట్ కావడం ఆతరువాత బెయిల్ పై విడుదల కావడం మనకు తెలిసిందే. కాకపోతే… అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అన్నికోట్లతో వ్యాపారం చేసేవాడు..చిన్న చెక్ బౌన్స్ కేసులో ఎలా ఇరుక్కున్నాడో అర్ధం కాదు. దీనికి బండ్ల గణేష్ ఇచ్చిన వివరణ కూడా భాగానే ఉంది.bఅయితే అది నిజమో కాదో తెలియదుగాని.. అసలు గణేష్ చెప్పిందేంటో ఓసారి తెలుసుకుందాం.

ఈ కేసును ఉద్దేశించి బండ్ల గణేష్‌ సోషల్‌మీడియాలో స్పందించారు. ‘2015లో వచ్చిన ‘టెంపర్‌’ సినిమా వివాదం ఇది’’ అంటూ వరుస ట్వీట్లు చేశారు. ‘‘కోటి నాలుగు లక్షల రూపాయలకు ‘టెంపర్‌’ కథా హక్కులను రచయిత వంశీ నుంచి కొన్నాను. సినిమా సూపర్‌ హిట్‌ అయిన తరువాత హిందీ రీమేక్‌ హక్కులను దర్శక, నిర్మాత అయిన రోహిత్‌ శెట్టికి సంయుక్తంగా విక్రయించాం. కానీ, నాకు తెలియకుండా ‘టెంపర్‌’ కథా హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మారు. దీని వల్ల నేను తీవ్ర మనస్తాపానికి లోనై, విషయాన్ని సినీ ఛాంబర్‌ దృష్టికి తీసుకువెళ్లా. అదే సమయంలో ‘టెంపర్‌’ చిత్ర కథకి ఇచ్చిన బ్యాలెన్స్‌ డబ్బుల చెక్‌ను నిలిపివేశాను. ఈ వివాదం ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉన్నప్పటికీ వంశీ చెక్‌ను పట్టుకొని కోర్టుకి వెళ్లారు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇచ్చింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్‌ పొందాను. ఈ విషయంపై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్‌కు వెళ్తున్నాను. రచయిత వంశీపై న్యాయ పోరాటం సాగిస్తాను’.అంటూ రాసారు.

అక్కడితో ఊరుకోకుండా… ‘‘టెంపర్‌’ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు, నా సినిమా యూనిట్‌కు, సహాయ రచయితలకు, వంశీ మనస్సాక్షికి తెలుసు.. సినిమా రంగంలో నటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించే స్థితిలో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకోగలరు’ అంటూ బండ్ల గణేష్‌ తన ట్వీట్లలో పేర్కొన్నారు.

https://www.youtube.com/watch?v=v1EmSCQJnGs

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -